అతిలోక సుంద‌రి త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నుందా?  అవున‌నే అంటున్నాయి బుల్లి తెర వ‌ర్గాలు. సినిమారంగంలో టాప్ స్టార్‌లుగా చ‌లామ‌ణి అయిన‌వాళ్లంతా.. చివ‌రి ద‌శ‌లో టీవీ వైపుకు టర్న్ తీసుకోవ‌డం మామూలే. ఇప్పుడు ఆ జాబితాలో శ్రీ‌దేవి కూడా చేర‌బోతున్న‌ట్టు స‌మాచారం.

త్వ‌ర‌లోనే బుల్లితెర వ్యాఖ్యాత‌గా శ్రీ‌దేవిని చూసే అవ‌కాశాలున్నాయ‌ట‌. ఓ పాపుల‌ర్ టీవీ ఛాన‌ల్ శ్రీ‌దేవితో ఓ రియాల్టీ షో చేయించ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఒకొక్క ఎపిసోడ్‌కి రూ.20 ల‌క్ష‌లు ఇవ్వ‌డానికి కూడా సిద్ధ‌మైంది. అస‌లే శ్రీ‌దేవి అప్పుల్లో ఉంది, ఈ ప‌రిస్థితిల్లో త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఎలాంటి అవ‌కాశాన్నీ శ్రీ‌దేవి వ‌దులుకోవ‌డం లేదు. కాబ‌ట్టే ఈ ఛాన్స్‌నీ వ‌దులుకోదు. అంటే.. శ్రీ‌దేవి త్వ‌ర‌లోనే మ‌న ఇంటి తెర‌పై రాబోతోంద‌న్న‌మాట‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి: