ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఏ హీరోయిన్ అయినా చెప్పేది ఒకటే. మంచి పాత్ర వస్తే చాలు ఎంతటి కష్టమైనా పడతాం, ఏ హీరోతో అయినా చేస్తాం అంటారు అందమైన ముద్దుగుమ్మలు. అదే స్టార్ హీరోయిన్ అయ్యాక  తాను తాగే నీళ్ళు దగ్గర నుండి షూటింగ్ స్పాట్ లో ఉండే వాతావరణం వరకు అన్నిటికి పేర్లు పెట్టేస్తారు. అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఎండ ఎక్కువగా ఉంది, వేడిగా ఉంది అంటూ దర్శక నిర్మాతలను కంగారు పెట్టడమే కాకుండా వాళ్ళ లెవెల్ అంత చూపెడతారు.

క్యూట్ అందాలతో ఎదో మాయ చేసిన సమంత కూడా ప్రతి దానికి వంక పెడుతోందట. ఈ మధ్య ఓ సినిమా షూటింగ్ లో ఎండ ఎక్కువగా ఉండడంతో షూటింగ్ చెయ్యను, ఒకవేళ చేసినా షూటింగ్ తొందరగా కంప్లీట్ చేయాలి అంటూ నానా రకాల షరతులు పెట్టేసిందట. అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు మరి కొన్ని కండిషన్స్ కూడా పెట్టేసిందట.

ఇక మీద తాను టాప్ హీరో సినిమాలలో మాత్రమే నటిస్తానని, మామూలు హీరో అయతే ఒప్పుకునే ప్రసక్తే లేదంటుందట. అదేంటి అంటే  తనతో  రొమాన్స్ చేసే హీరోకి ఒక లెవెల్ అనే   మెట్ట వేదాంతం చెపుతోందట. అయితే సమంత బెల్లం కొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నావు కదా అని అడిగితే శ్రీనివాస్ ని చూసి ఒప్పుకోలేదు, వాళ్ళ నాన్న బడా ప్రొడ్యూసర్ ఆయనతో ఉన్న రిలేషన్ వలన ఆ సినిమాకు సైన్ చేశాను అని చెపుతోందట! అందుకే కాబోలు బెల్లంకొండ కు రిమ్మ తిరిగేలా పారితోషకం వసూలు చేసిందని వార్తలు వచ్చాయి. ఓ రేంజ్ హీరోయిన్ కదా మరి ఆమాత్రం దూకుడు ఉంటుంది....

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: