హీరోయిన ప్రధాన పాత్రగా తీసిన ‘ పవిత్ర ’ మైన సినిమా. వ్యభిచారిణి ప్రధానపాత్రగా తీసిన సినిమా కథ మహిళాలోకం చూడని విధంగా అశ్లీలంగా ఉంటుందనే భావన ఉంటే వెంటనే చెరిపేసుకోవాలి. నిజానికి నేటి యువతులు, మహిళలే తప్పని సరిగా చూడాల్సిన సినిమా పవిత్ర. ఈరోజుల్లో వస్థున్న కుటుంబ కథా చిత్రాలలో చూపిస్థున్నంత అసభ్యతలో నయాపైసంతా కూడా అశ్లీలం లేకుండా, సమాజం యావత్తు ఈసడించుకునే వ్యభిచారిణి కూడా ఎంత పవిత్రమో చూపించి సమాజం కళ్లుతెరిపించిన సినిమా.

నేడు ప్రేమించలేదని కడు క్రూరంగా యువతులను చంపే నరరూప రాక్షసులు, కళ్లు మూసుకుపోయిన కామంతో ఆడవారిని అతికిరాతకంగా అనుభవించి హత్యలు చేస్థున్న మానవ మృగాలు, ఆడదాని శీలాన్ని కూడా వాడుకోవాలనే కుటిల రాజకీయుల కంటే దేహాన్ని మాత్రమే మలినం చేసుకుని మనసును పవిత్రంగా ఉంచుకునే వ్యభిచారిణి ఎంత ఉన్నతమైనదో చూపించిన సినిమా పవిత్ర.

తన తల్లిని భయంకరమైన కాన్సర్ బారి నుంచి రక్షించుకోవడానికి ఏదిక్కు, ఆర్థికస్థోమత లేని యువతి తన దేహాన్ని పనంగా పెట్టి వ్యభిచారిణిగా మారిన క్రమం అందరి హృదయాలను ద్రవించి వేస్థుంది. వ్యభిచారిణి కూడా చాలా ఉన్నతమైనది అని ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిన యువకుడు, ఆ కథాక్రమం హార్ట్ టచ్ చేసింది. మగవారి వికృత చేష్టలకు బలవుతున్న యువతులను, మహిళలను రక్షించి ఆదుర్మార్గునికి బుద్ది చెప్పే వైనం కూడా సందేశాత్మకంగా తీసారు. తన వాంటి నిస్సహాయులు ఎవరు కూడా వ్యభిచారిణులుగా మారవద్దు అని,  ఒక వ్యభిచారిణి తన ఒళ్లు అమ్ముకుని వచ్చిన  సొమ్ములో అధిక భాగం వారికోసం కేటాయించడాన్ని చూపించిన వైనం నేటి సమాజానికి ఆదర్శం.

నేడు చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఆడవారు ఎదుర్కొంటున్న కష్టాలు, గురవుతున్న అరాచకాలకు ఏవిధంగా చెక్ పెట్టాలి, దాని కోసం మన పాలన వ్యవస్థలో ఎలాంటి మార్పు రావాలి, దానికోసం ఒక ఉమెన్ ప్రొటెక్షన్ మినిస్ట్రీ ఉండాలని, అది వంచించబడి, మోసపోయిన మహిళకే కేటాయిస్థే నివారించబడుతాయన్న సందేశాన్ని కూడా పవిత్ర సినిమా సూచించింది. ఇక ప్రధాన పాత్రలో శ్రియ, ఇతర పాత్రల్లో సాయికుమార్, బ్రహ్మానందం, ఏవిఎస్, రవిబాబు, రోజా ఇలా అందరు సినిమాలోని తమ పాత్రలకు జీవం పోసారు. మంచి కథ, డైరెక్షన్ ఇతర సాంకేతిక వర్గం చక్కడా రానించి మంచి సందేశాత్మక సినిమాల విభాగంలో రాష్ట్రస్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా మంచి అవార్డును పొందగలిగే స్థాయిలో సినిమా తీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: