య‌మ‌లీల.. అలీని హీరోని చేసింది. ఆ త‌ర‌వాత దాదాపు 40 సినిమాల్లో అలీ హీరో వేషాలేశాడు. ఈమ‌ధ్య కామెడీ వేషాలు మాత్ర‌మే వేస్తున్నాడు. అయితే మ‌ళ్లీ ఇప్పుడు హీరోగా పోజు కొట్ట‌బోతున్నాడు. అలీ హీరోగా రూపొందుతున్న చిత్రం.. అలీబాబా - ఒక్క‌డే దొంగ‌. ఫ‌ణి ప్ర‌కాష్ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈనెల 18న చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడ‌తారు. పోలీస్ కావాల‌నుకొని దొంగ అయిన ఓ వ్య‌క్తి క‌థ ఇది. పూర్తి వినోదాత్మ‌కంగా సాగుతుంద‌ట‌. కామెడీ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగే సినిమా అట‌. అలీ స‌ర‌స‌న ఓ కొత్త‌మ్మాయిని క‌థానాయిక‌గా ఎంచుకొంటారు. ఈ సినిమా అలీని మ‌ళ్లీ హీరోగా బిజీ చేస్తుంద‌ని దర్శ‌క నిర్మాత‌లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: