గంధ‌పు చెక్కల స్మగ్లింగ్ అనగానే వీర‌ప్పన్ గుర్తొస్తాడు. రెండు రాష్ట్ర్ర ప్రభుత్వాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన స్మగ్లర్ ఇతడు. ఒక నాటి కన్నడ సూపర్ స్టార్ రాజకుమార్ ను కిడ్నాప్ చేసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రిమినల్ ఇతడు.  వీర‌ప్పన్ క‌థ ఆధారంగా త‌మిళంలో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ‘వాన యుద్ధం’ ఒక‌టి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. అర్జున్‌, ల‌క్ష్మీరాయ్ జంటగా న‌టించారు. వీర‌ప్పన్ పాత్రలో కిషోర్ క‌నిపిస్తారు.

ఆత‌న్ని ప‌ట్టుకొనే పోలీస్ అధికారిగా అర్జున్ న‌టించారు. వీర‌ప్పన్‌తో ప‌రిచయం ఉన్నవాళ్లంద‌రినీ వ్యక్తిగతంగా క‌లుసుకొని. వారి ద‌గ్గర నుంచి అభిప్రాయాలు సేక‌రించి వాస్తవాల‌కు ద‌గ్గర‌గా రూపొందించిన సినిమా ఇది అని అంటున్నారు.. ర‌మేష్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. క‌న్నడ‌లో కూడా ఈ సినిమా విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందింది. ఇప్పుడు తెలుగులో తీసుకొస్తున్నారు. ప్రస్తుతం డ‌బ్బింగ్ కార్యక్రమాల‌ను జ‌రుపుకొంటోంది. త్వర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.

వీరప్పన్ జీవితం, వీరప్పన్ మరణం అంతా మిస్టరీ. అతని జీవితం గురించి ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు అతని జీవితంలో మిగిలి ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఈ సినిమా ఎంతవరకు సమాధానాలు ఇస్తుందో వేచిచూడాలి....

 

మరింత సమాచారం తెలుసుకోండి: