సాంఘీక దురాచారాల పై గురజాడ అప్పారావు పూరించిన శంఖారావం ‘కన్యాశుల్కం’ నాటిక వంద సంవత్సరాల నాటి  సమాజంలో ని సాంఘిక దురాచారాలు, స్త్రీలకు  జరుగుతున్న అన్యాయాల మానవీయ కోణంలో గురజాడ  ఆవిష్కరించిన తీరును మెచ్చుకోని వారుండరు. అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ అదొక మహా దృశ్యకావ్యంగా పిలువబడుతుంది.

 అందుకే వంద సంవత్సరాలు పూర్తి అయినా ఈ నాటకాన్ని చూస్తూ ఉంటే, ఆనాటి మనుషుల మనస్తత్వాలు ఈ నాటికీ సజీవంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. అటువంటి దానిని మరో సారి మనకు  దృశ్యరూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు మన టివి కళాకారులు.  సెలబ్రిటీ థియేటర్‌ ఫెస్టివల్‌ సందర్భంగా ఝాన్సీ, ఉత్తేజ్‌, రాళ్లపలి నటీనటులు కలిసి కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించనున్నారు. డి.ఎస్‌. దీక్షిత్‌ దర్శకత్వం వహించిన ఈ నాటకం ఈనెల 16న రవీంద్రభారతిలో జరగనుంది.

తెలుగు నాటక గొప్ప తనానికి సజీవ దర్పణములా భాసిల్లే కన్యాశుల్కం తెలుగు భాష, తెలుగు వారు జీవించి ఉన్నంత కలాం తెలుగు హృదయాలలో సజీవం...

మరింత సమాచారం తెలుసుకోండి: