సస్పెన్స్ + హారర్ + కామెడి = ప్రేమకథా చిత్రమ్. ఏ సర్టిఫికేట్, హారర్ కథల దర్శకుడు, సినిమా టాక్ కూడా అదే... అందుకే ఆ ఆలోచనలతో సినిమాకు వెల్లిన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి ‘ అందరి చేత ఇది ‘ ప్రేమకథా కామెడి చిత్రమ్ ’ అనిపించేలా చేసింది. అలా అని ప్రేక్షకుల ఊహలను కూడా తలకిందులు చేయకుండా కాస్థా హారర్, అంతకు మించి సస్సెన్స్ పెట్టి సినిమాను మొదటి నుంచి చివరి దాకా ఎంజాయ్ చేసేలా తీసారు.

కొత్త నటులు, తక్కువ తారాగణం, అంతగా సినీ ఇండస్ట్రీలో పేరులేని కమెడియన్స్, పాపులర్ కాని బ్యానర్ కాబట్టి లైట్ గా తీసుకున్నవారికి ఘాటు సమాధానమిచ్చింది ప్రేమకథా చిత్రమ్. అంతగా ఖర్చులేకుండా, ఒకటే గెస్ట్ హౌజ్, నలుగురు ప్రధానతారాగణం, వారికి తోడుగా అప్పుడప్పుడు మరో ఇద్దరిని చూపిస్థూ సినిమానంతా సూపర్ గా తీసి మంచి సినిమాలు లేక మొహం వాచిపోయిన సినీ ప్రేమికులకు కుటుంబంతో సహా కలిసి హాయిగా నవ్వుకుంటూ, నోళ్లు వెల్లబెట్టి చూసే హారర్, సస్పెన్స్ పెట్టి అన్నిరకాలను చూసి ఎంజాయ్ చేసేలా ఉంది సినిమా.

ఇక సినిమాలో ఇచ్చిన ఝలక్ లు అంతా ఇంతా కాదు, ఇంటర్వెల్ బ్రేక్ తో కంగుతినిపించే కటింగ్ ఇచ్చారు. హీరోయిన్ తో హీరో ప్రేమ పండింది అన్న తరుణంలో ఇచ్చిన షాక్ కళ్లు బైర్లు కమ్మించింది. ఈరెండు సినిమాలో ఏంజరుగుతుంది అన్న హైటెన్షన్ క్రియేట్ చేసాయి. అయితే టెన్షన్ ను ఎక్కడా తగ్గించకుండా ఆకథనంతా కడుపుబ్బనవ్వించే కామెడీతో తీయడం నిజంగా సూపర్. మాటలు, డైలాగులు, నటీనటుల ప్రతిభ సినిమాలో పంటపండించాయి.

అన్నింటికి మించి హీరో, హీరోయిన్ ల ప్రేమ, వారు ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలను కోవడం, వారికి మరో ఇద్దరిని జోడించడం, ఎవరు ప్రేమలో ఫెయిలయ్యారు, ఎవరు ఎవరికోసం తాపత్రయపడుతున్నారు అన్నది మొదట సస్సెన్స్ క్రియేట్ చేసి ఆతర్వాత హీరోకు తప్ప ప్రేక్షకులకు, మిగతా పాత్రలకు లీక్ చేసి కాసేపు కామెడి, థ్రిల్లింగ్ జోడించి నడిపించిన కథ హైలెట్. ఇలా ఏ కోణంలో చూసినా నటీనటుల నుంచి మొదలుకొని సాంకేతిక వర్గం అంతా వారి స్థాయికి మించి ప్రతిభ కనబరచి సినిమాకు ప్రాణం పోసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: