గుబురు మీసాలు, గంధ‌పు చెక్క‌లు అన‌గానే వీర‌ప్ప‌న్ గుర్తొస్తాడు. త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క ప్ర‌భుత్వాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన ఈ స్మ‌గ్ల‌ర్ ఇప్పుడు లేక‌పోయినా.. అత‌ని గురించి తెలుసుకోవాలి అనే కుతూహ‌లం మాత్రం చాలామందికి ఉంది. అందుకే వీర‌ప్ప‌న్ జీవితం

ఆధారంగా అటు త‌మిళంలోనూ, ఇటు క‌న్న‌డంలోనూ కొన్ని సినిమాలు తెర‌కెక్కాయి. వీరప్ప‌న్ మ‌ర‌ణం త‌ర‌వాత కూడా అత‌ని క‌థ సినిమాల‌కు ప‌నికొస్తోంది. త‌మిళంలో వీర‌ప్ప‌న్ జీవితంపై ఓ సినిమా తీశారు. అదే..  వాన యుద్ధం. అర్జున్ క‌థానాయ‌కుడు. వీర‌ప్ప‌న్ గా కిషోర్ న‌టించారు.

ల‌క్ష్మీరాయ్ క‌థానాయిక‌.  వీర‌ప్పన్‌తో ప‌రిచయం ఉన్నవాళ్లంద‌రినీ వ్యక్తిగతంగా క‌లుసుకొని.. వారి ద‌గ్గర నుంచి అభిప్రాయాలు సేక‌రించి వాస్తవాల‌కు ద‌గ్గర‌గా రూపొందించిన సినిమా ఇది. ర‌మేష్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. త్వర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: