వ‌ద్దూ.. వ‌ద్దంటున్న అంద‌రూ అన‌సూయ చుట్టూనే తిరుగుతున్నారు. మొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అత్తారింటికి దారేది కోసం... అన‌సూయ‌ను తెగ బ‌తిమాలేశారంతా!  త్రివిక్ర‌మ్ సినిమాకే నో చెప్పేసింది. అమ్మో.. అన‌సూయ మామూలుది కాదు.. అని అంద‌రూ ముక్కున వేలేసుకొన్నారు.

ఆ షాక్ నుంచి తేరుకోక ముందే... ఈ స్వీట్ అండ్ హాట్ యాంక‌ర్ ఇంకో షాక్ ఇచ్చింది. ప‌వ‌న్ సినిమాకే కాదు.. ఈ అమ్మ‌డిని బ‌న్నీ సినిమాకీ అడిగార‌ట‌. రేసుగుర్రంలో ఓ పాత్ర కోసం అన‌సూయ‌ను సంప్ర‌దించార‌ట‌. దానికీ నో అనేసిందట‌. కార‌ణం ఏమిటీ..?  అని అడిగితే ''రేసుగుర్రం కోసం ఆగ‌స్టు నుంచి నా కాల్షీట్లు అడిగారు.

స‌రిగ్గా అదే స‌మయంలో మా ఇంట్లో ఓ శుభ‌కార్యం ఉంది. దాన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడ‌దు.. అందుకే ఈ  ఆఫ‌ర్ కూడా వ‌దులుకొన్నా..'' అంటోంది. అమ్మో... ఇలాంటి ఆఫ‌ర్లు ఎవ‌రికైనా వ‌స్తాయా? వ‌స్తే వ‌దులుకొంటారా?  అన‌సూయ మాత్రం ఇలా ఎందుకు చేస్తుందో ఏమో..?

మరింత సమాచారం తెలుసుకోండి: