నాగచైతన్య, సునీల్ ప్రధాన పాత్రధారులగా వచ్చిన ‘తడాఖా’ విషయంలో హిందీ హీరో  అభిషేక్ కన్ను పడిందా? అవును అనే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. మొదట తమిళంలో విడుదలయి, అక్కడ సూపర్ హిట్ గా నిలిచి, ఇప్పుడు తెలుగులో హిట్ అయిన ఈ సినిమా గురించి అభిషేక్ బచ్చన్ వాకబు చేస్తున్నాడట. రెండు భాషల్లో హిట్ అయిన సబ్జెక్ట్ అంటే..అందులో ఏదో విషయం ఉండే ఉంటుందని జూనియర్ బచ్చన్ భావిస్తున్నాడని సమాచారం.

దీన్ని హిందీలో రీమేక్ చేస్తే  ఎంతవరకు బాగుంటుంది అనే విషయం ఆలోచిస్తున్నాడట. దీనికి కారణం  ఆ సినిమాలో నాగచైతన్య చేసిన రోల్ తనకు బాగుంటుందని అభిషేక్ అభిప్రయమట ఫీలవుతున్నాడట.   ప్రస్తుతం దక్షిణాధి సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యి హిట్స్ గా నిలుస్తున్ననేపథ్యంలో ఈ  విధంగా తనకు సెంటిమెంటు గా బాగుటుందని అభిషేక్ అబిప్రయమాట.

దీనిని  బట్టి తమిళంలో హిట్టైన ‘వెట్లై’ తెలుగులో ‘తడాఖా’ చూపించి హిందీలో సత్తా చాట డానికి రెడీ అవుతుందని అనుకోవాలి! అసలు ఇన్ని భాషల్లో రీమేక్ అవ్వగల స్క్రిప్ట్ ను రూపొందించిన లింగుస్వామి గొప్ప తనం మెచ్చుకోవాలి ‘పందెం కోడి’ సినిమా విజయంతో ఒకేసారి వెలుగులోకి వచ్చిన దాని తరువాత వచ్చిన ‘బీమా’ సినిమా పరాజయంతో నిరాస చెందకుండా మళ్ళీ ‘తడాఖా’ సినిమా ద్వారా తన తడాఖా చూపించాడు.  బాలీవుడ్ లో నాగచైతన్య రోల్ కు అభిషేక్ సరిపోయే అవకాశం ఉండగా, సునీల్ రోల్ కు జాన్ అబ్రహం ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే చైతూ ను అభిషేక్ ఫాలో అవుతున్నట్లుగ అనిపిస్తోంది.....

 

మరింత సమాచారం తెలుసుకోండి: