క‌మెడియ‌న్ నుంచి హీరోగా ఎదిగాడు.. సునీల్. చేతిలో కొన్ని హిట్లూ ప‌డ్డాయి. దాంతో కామెడీ వేషాలు మానేశాడు. మ‌రీ ప్ర‌త్యేకం అయితే త‌ప్ప ఒప్పుకోవ‌డం లేదు. చాలాకాలం త‌ర‌వాత సునీల్‌ని ఓ త‌మాషా పాత్ర‌లో చూసే అవ‌కాశం ద‌క్క‌బోతోంది. ఆయ‌న ఇప్పుడు బ‌బామాగా క‌నిపించ‌బోతున్నారు. ఒబామా అంటే అమెరికా అధ్య‌క్షుడు అనుకొనేరు.

అంత లేదిక్క‌డ‌. ఓరుగంటి బాల మ‌హేష్‌. షార్ట్ క‌ట్‌లో ఒబామా అన్న‌మాట‌. ఈ సంద‌డంతా.. న‌రేష్ త్రీడీ సినిమా యాక్ష‌న్ కోసమే. ఈ సినిమాలోనే సునీల్ ఒబామాగా క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో సునీల్ క‌నిపించేది కాసేపే అయినా.. అత‌ని పాత్ర భ‌లే న‌వ్విస్తుంద‌ని చిత్ర‌బృందం చెబుతోంది. మరి ఈ ఒబామా ఎంత వినోదాన్ని పంచిపెడ‌తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: