ఆధునిక వ‌స్త్రాలంక‌ర‌ణ‌తో మాయ చేసింది.. స‌మంత‌. ఏ దుస్తులు వేసుకొన్నా - ఆమె అందం త‌ర‌గ‌లేదు. చీర క‌ట్టినా గ్లామ‌ర్ ఎప్పుడూ మిస్ అవ్వ‌లేదు. ఇప్పుడు తొలిసారి.. పూరి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపిస్తోంది. ఓ భ‌ర‌త నాట్య క‌ళాకారిణిగా. ఏ సినిమాలో...  

అని అడ‌గొద్దు. అది స‌స్పెన్స్‌. స‌మంత భ‌ర‌త‌నాట్య క‌ళాకారిణి గెట‌ప్‌లో ఓ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది స‌మంత త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిందే. ''నాకు భ‌ర‌త‌నాట్యం రాదు. అయినా స‌రే, ఎలా ఉంటుందో అని ఈ గెట‌ప్ ట్రై చేశా..'' అంటోంది. స‌మంత అలా అంటున్నా..

త‌ను న‌టిస్తున్న ఏదో ఓ సినిమాలో ఈ అవ‌తారం ఎత్తుతుంద‌ని.. భావిస్తున్నారంతా. స‌మంత ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో న‌టిస్తోంది. మ‌రి రెండింటిలో ఈ గెట‌ప్ ఏ సినిమాలోనిదో మ‌రి!?

మరింత సమాచారం తెలుసుకోండి: