మ‌హేష్‌బాబు - త్రివిక్ర‌మ్‌ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అత‌డులో మ‌హేష్‌ని అద్భుతంగా చూపించాడు త్రివిక్ర‌మ్‌. ఆ త‌ర‌వాత ఖ‌లేజాలోనూ మ‌హేష్ త‌న మేన‌రిజాల‌తో మెస్మ‌రైజ్ చేసేశాడు. రెండు సినిమాలో ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం కూడా బాగా పెరిగింది. ఇప్పుడు మ‌రోసారి జ‌ట్టు క‌ట్ట‌బోతున్నారు. ఇదే వీరి హ్యాట్రిక్ క‌ల‌యిక‌. అయితే సినిమా కోసం కాదు.

ఓ టీవీ యాడ్ కోసం. మ‌హేష్ టీవీఎస్ మోటార్ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ సంస్థ‌కు చెందిన ప్ర‌చార చిత్రాన్ని రూపొందిస్తున్నారిప్పుడు. దానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. టీవీఎస్ కంపెనీకి త్రివిక్ర‌మ్ పేరు రిక‌మెండ్ చేసింది మ‌హేషేన‌ట‌. వీరిద్ద‌రి మ‌ధ్య స్నేహం బ‌ల‌ప‌డింది అని చెప్ప‌డానికి  ఇంక కంటే రుజువు ఏం ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: