బ‌న్నీ రేంజ్ ఏమిటో ఇంకోసారి తెలిసొచ్చింది. డివైడ్ టాక్ న‌డుస్తున్నా - త‌ప్పుడు స్టేట్‌మెంట్ల‌తో  పూరి మెగా ఫ్యాన్స్‌ని దూరం చేసుకొన్నా - బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమా దూసుకుపోతూనే ఉంది. తొలి వారం ఇద్ద‌రు అమ్మాయిల‌కు రూ.25 కోట్లొచ్చాయ‌ట‌. బ‌న్నీ సినిమాల్లో ఇదే రికార్డ్‌. ఇది వ‌ర‌కు బ‌ద్రినాథ్‌కీ తొలి మూడు రోజులు వ‌సూళ్లు భీక‌రంగానే వ‌చ్చాయి. త‌ర‌వాత డ్రాప్ అయ్యాయి.

ఈ సినిమా తొలి వారం కుమ్మేసింది. ఇంత డివైడ్ టాక్ న‌డిచిన త‌ర‌వాత కూడా ఇన్ని వ‌సూళ్లు వ‌చ్చాయంటే అది.. త‌ప్ప‌కుండా బ‌న్ని స్టార్ ఇమేజే అత‌ను త‌న శ‌క్తివంచ‌న లేకుండా క‌ష్ట‌ప‌డిన విధానం ఫ్యాన్స్‌కి న‌చ్చింది. అందుకే ఇన్ని డ‌బ్బులొచ్చాయ్‌. మ‌రి రెండో వారం ప‌రిస్థితి ఏమిటో మరి. నిర్మాత గ‌ణేష్ రిస్క్ నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే రెండోవారం కూడా ఎన్నో కొన్ని కోట్లు దక్కించుకోవ‌లసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: