ఈరోజుల్లో, బ‌స్‌స్టాప్ సినిమాల‌తో త‌న మార్క్ చూపించాడు మారుతి. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా బాగా ఆడాయి. అయితే మారుతిపై బూతు దర్శ‌కుడు అనే ముద్ర వేసేశాయి. ఆ ముద్ర చెరుపుకోవ‌డానికి మారుతి నానా తిప్ప‌లు ప‌డ్డాడు. నేను మారిపోయా - ఇక నా సినిమాల్లో బూతు ఉండ‌దు - జంథ్యాల మార్కు సినిమాలే తీస్తా -

అని ప్ర‌క‌టించాడు. స‌రేలే మారుతి మారాడు అనుకొన్నారు సినిమా వాళ్లు. ప్రేమ‌క‌థా చిత్రం సినిమా చూస్తున్న‌ప్పుడు అలాగే అనిపించింది. ఈ సినిమాకి మారుతి ద‌ర్శ‌కుడు కాక‌పోయినా.. ద‌ర్శ‌కుడులాంటి వాడే. క‌థ, స్ర్కీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌, నిర్మాత ఇలా అన్నీ ఆయ‌నే ఈ సినిమాకి. తొలి భాగంలో ఒక్క బూతూ లేక‌పోవ‌డంతో నిజ్జంగా మారుతి మారిపోయాడు అనుకొన్నారంతా.

కానీ సెకండాప్‌లో మాత్రం మారుతిలోని కోతి చేష్ట‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. గుల‌బ్‌జామ్, బ్యాటింగ్ అంటూ బూతుని మ‌రో పేరుతో వినిపించాడు. సినిమా సాఫీగా సాగిపోతున్న‌ప్పుడు ఈ బూతు బాగోతం ఏమిటో ప్రేక్ష‌కుల‌కు అర్థం కాలేదు. మారుతిలో అప్ప‌టి వ‌ర‌కూ నొక్కి పెట్టిన ఆవేశం.. చివ‌ర్లో ఆపుకోలేక క‌ట్టెలు తెంచుకొచ్చిందేమో. వ‌రుస‌గా బూతులు ప‌డిపోయాయి. ప్ఛ్.. మారుతి ఇక మార‌డా??

మరింత సమాచారం తెలుసుకోండి: