ఈ వారం మూడు చిన్న సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ప‌విత్ర‌, ప్రేమ‌క‌థాచిత్రం, థియేట‌ర్‌లో న‌లుగురు. వీటితో ప‌విత్ర‌, ప్రేమ క‌థాచిత్రమ్ సినిమాల‌కు వ‌సూళ్లు బాగున్నాయి. తొలిరోజు రెండు సినిమాల‌కూ హౌస్‌ఫుల్ బోర్డులు క‌నిపించాయి.

అందంగా ముస్తాబైన శ్రియ పోస్ట‌ర్లు కుర్ర‌కారునే కాక‌.. పెద్ద‌వారినీ ఆక‌ట్టుకొన్నాయి. దాంతో ఆ సినిమా హాళ్లు నిండుకొంటున్నాయి. మ‌రోవైపు ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ సినిమా యువ హోరు ఎక్కువైంది. థియేట‌ర్‌లో అంతా కుర్ర‌కారే సంద‌డి చేస్తున్నారు. మారుతి బ్రాండ్‌నేమ్ ఈ సినిమాకి యూత్‌ని తీసుకొస్తుంది. దాంతో పాటు ప్ర‌చార చిత్రాలూ ఆక‌ట్టుకొనేలా ఉండ‌డం ఈ సినిమాకి క‌లిసొచ్చింది.

శ‌ని, ఆది వారాలు కూడా ఈ సినిమాల జోరు ఇలాగే కొన‌సాగే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే రెండు సినిమాలూ ఆర్థికంగా గ‌ట్టెక్కేసిన‌ట్టే. థియేట‌ర్‌లో న‌లుగురు సినిమా మాత్రం టైటిల్ ని సార్థ‌కం చేసుకొనే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ సినిమాని జనాద‌ర‌ణ లేక‌పోవ‌డంతో.. థియేట‌ర్లు బోసిబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: