శ్రేయ పని ఐపోయిందా? దశాబ్దo కాలం పాటు టాలీవుడ్ లో చక్రం తిప్పిన శ్రేయ చేతిలో ఉన్న ఒకేఒక చిత్రం ‘పవిత్ర’ మొన్న టాలీవుడ్ లో రిలీజ్ అయింది. జనార్ధన మహర్షి డైలాగ్స్, తన స్కిన్ షో రక్షిస్తాయి అని అనుకున్న శ్రియ ఆశలు గాలిలో కలిసిపోయాయి. కధ బాగున్నా దర్శకుడి వీక్ నరేషన్ తో మొదటి రోజు మొదటి ఆట నుండే ప్లాప్ టాక్ మూటకట్టుకుంది.

ఇక ఈ సినిమా గట్టేక్కేస్తే ఎలాగోలా నాలుగైదు ఛాన్సులు దక్కుతాయని భావిచిన శ్రీయ అసలాన్నే ఒక్క రోజులోనే ఆవిరైపోయాయ, తర్వాత సినిమా గా అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ ఉన్నా అదేమంత పట్టించుకోతగ్గ పాత్ర కాకపోవడంతో శ్రీయ పని ఐపోయింది అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో శ్రియది సోలో హీరోయిన్ గా పాత్ర కాకపోవడంతో  గుంపులో గోవింద అనుకుని తన కెరియర్ ప్లాన్ మార్చేసిందట.  

 ఇక ట్రెండ్ మార్చి మోడలింగ్, ర్యాంప్ షోలకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రేయ భావిస్తున్నాట్లు సమాచారం. మోడలింగ్ నుండి సినిమా రంగం వైపు అందరూ వస్తుంటే శ్రియ తన రూట్ మార్చి సినిమా రంగం నుండి మోడలింగ్ వైపు వెళ్ళడం బట్టీ శ్రియ హాట్ లుక్స్ కు క్రేజ్ తగ్గిందని ఆమెకే అర్ధం అయింది అనుకువాలి. మొత్తం మీద చూస్తే శ్రియ కెరియర్ సినిమా రంగంలో అయిపోయినట్లే లెక్క....

మరింత సమాచారం తెలుసుకోండి: