చదువు మధ్యలో ఉండగానే మోడలింగ్‌లో ప్రవేశించి ర్యాంప్‌పై   అందాలు ఆరబోసిన  నిఖితా నారాయణ్‌  ‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ’ వంటి చిన్న సినిమాతో హీరోయిన్‌ ఛాన్స్‌ అందుకున్న ఈ బెంగుళూరు బ్యూటీ, కన్నడ సినిమా రంగంలో  పేరుతెచ్చుకుంది కాని, అవకాశాలు మాత్రం రా వడంలేదు. ఈవిడ నటించిన ‘రేస్‌’, ‘మేడిన్‌ వైజాగ్‌’ లాంటి సినిమాలు కూడా అట్టర్‌ప్లాపై హ్యాండిచ్చాయి.

ఎంట్రీలోనే ఎదురుదెబ్బతిన్న ఈ భామ పట్టువదలక ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఇలా పూర్తిగా డీలాపడిపోయిన దశలో నిఖితాకి సీనియర్‌ డైరెక్టర్‌ వంశీ రూపంలో ‘తను మొన్ననే  వెళ్ళిపోయింది’ అనే  సినిమా దొరికింది.

తమిళ హీరో అజ్మల్ సరసన ఈ సినిమాలో మేడలో బ్లేడ్ లకేట్ తో హీరోయిన్ నిఖిత మరోసారి కనిపించి హలచల్ చేస్తోంది. వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా వదిలి సినిమా పై పిచ్చితో సినిమా రంగంలోకి వచ్చిన నిఖిత కెరియర్ ప్రారంభమే పెద్ద పీడకలలా తయారైంది. కనీసం ఇప్పుడైనా వంశీ రాకతో నిఖిత కెరియర్ ట్రాక్ లో పడుతుందేమో చూడాలి. ఇలా జరగాలంటే ఈ బ్లేడ్ సుందరిని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి....  

   

మరింత సమాచారం తెలుసుకోండి: