“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు” అని అడివిరాముడు సినిమాలో ఎన్టిఆర్ అంటారు. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం నందమూరి తారకరామారావు. సినిమా హీరోగా అయినా, రాజకీయ మహానాయకుడిగా అయినా , ఏ రంగంలో అయినా  ఆంధ్ర దేశాన మకుటం లేని మహారాజు గా నాలుగున్నర దశాభ్దాల పాటు ఏలిన మహాపురుషుడు ఆయన. ఆయన నట జీవితంలో, ముఖ్యంగా షూటింగ్ లో జరిగిన ఆశక్తికర సంఘటనలు ఇప్పటికీ టాలీవుడ్ లో కధలు కధలుగా చెప్పుకుంటారు. అటువంటి సంఘటనలలో ఇది ఒకటి.

ప్రముఖ హాస్య నటుడు పద్మనాభం “దేవత” సినిమాను ఎన్టిఆర్ – సావిత్రి జంటగా నిర్మించారు. ఇందులో సావిత్రి ది ద్విపాత్రాభినయం. మహాకవి శ్రీ శ్రీ రాసిన “బొమ్మను చేసి ప్రాణం పోసి” అనే పాట మినహా షూటింగ్ అంతా పూర్తి అయి పొయింది అట. అప్పట్లో ఎన్టిఆర్ ప్రతి సినిమాకు 30 రోజులు కేటాయించే వారట. ఆ 30 రోజులు పూర్తి అయిపోయినా ఈ పాట చిత్రీకరణ పూర్తి కాలేదు. ఈ పాటను అనుకున్న విధంగా షూట్ చెయ్యాలి అంటే కనీసం ఎన్టిఆర్ డేట్స్ మూడు రోజులు కావాలి. కాని ఆ సంవత్సరానికి అంతా ఎన్టిఆర్ డైరీ నిండి పోవడంతో, ఈ పాటను ఎలా షూట్ చెయ్యాలో అర్ధం కాక ఈ పాట లేకుండానే సినిమా విడుదల చేద్దాం అనుకున్నారట. విషయం తెలుసుకున్న ఎన్టిఆర్ ఈ పాట దేవత సినిమాకు గుండెకాయ లాంటిది, ఆ పాటను తీసివేస్తే ఎలా..? రాత్రి 10:30 నుంచి ఉదయం వరకూ నాలుగు రోజులు షూటింగ్ పెట్టుకోండి, నాలుగు రోజులు నిద్ర మానుకొని నటిస్తాను అని ఎన్టిఆర్ పద్మనాభానికి, దర్శకుడు హేమంబధరరావు కి మాట ఇచ్చారు అట. మరి మీ నిద్ర ఎలా..? అని పద్మనాభం అంటే, షాట్ గ్యాప్ ల మధ్య కొద్దిగా కునుకు వేస్తానులే పరవాలేదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు అట.

అంతే ఎన్టిఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం నాలుగు రోజులు వరసగా రాత్రి 10:30 కి షూటింగ్ కి వెళ్ళేవారట. రైన్ ఎఫెక్ట్ లో తియ్యాల్సిన పాట కాబట్టి అంత చలికాలంలోనూ నెత్తిమీద రెండు బిందెల నీళ్ళు పోసుకొని షాట్ కు రెడీ అనేవారట ఎన్టిఆర్. షాట్ షాట్ కి వచ్చే గ్యాప్ లో చిన్న కునుకు తిసేవారట ఈ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ. షాట్ రెడీ అవ్వగానే తన నిద్ర మత్తు పోవడానికి మరో రెండు బిందెల చన్నీళ్ళు తలపై పోసుకొని షూటింగ్ లో పాల్గొనేవారట ఈ నందమూరి సింహం. ఇలా వరసపెట్టి మూడు రాత్రుళ్ళు వరసగా షూటింగ్ చేసి ఈ పాటను పూర్తి చేశారు అట. మరి అందుకే కాబోలు దేవత సినిమా ఇప్పటికీ చానల్స్ లో వస్తూ ఉంటే “బొమ్మను చేసి ప్రాణం పోసి” పాట వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు కనులు ఆర్పకుండా ఆ పాటను చూసి లీనమైపోతూ ఉంటారు. నటన, కృషి విషయాలలో అంత కృషి చేశారు కాబట్టే నందమూరి తారక రామారావు చనిపోయి ధశాభ్దాలు దాటిపోతున్నా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరంజీవి గా ఉన్నారు. దటిస్ ఎన్టిఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: