బ్రిటన్ లో అక్కడ ప్రజల సగటు వేతనం ఏడాది కి 26 వేల పౌండ్లు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయితే సంవత్సరానికి 40,000 పౌండ్లు సంపాదిస్తారు. కాని ఒక వ్యక్తి ఏ పని చేయకుండా అందరికంటే ఎక్కువగానే వెనకవేస్తున్నాడు. ఆ ఘనుడు ఎవరు అనుకుంటున్నారా..? అతడిని ఏమాత్రం తీసి పారవేయాలెం. అతడే సైమన్ రైట్. అతడి వయసు కేవలం 37 సంవత్సరాలు. అతడు కేవలం అడుక్కుంటూ సంవత్సరానికి 50,000 పౌండ్లు మన భారతదేశ కరెన్సీ లో 42 లక్షలు పోగేస్తున్నాడు. అతడికి ఏకంగా రెండున్నర కోట్లు విలువైన సొంత ఫ్లాట్ లండన్ లో ఉంది.

సైమన్ చేసేది కేవలం లండన్ లోని పట్నే హై స్ట్రీట్ లో వచ్చి పోయే వారిని తన మాటలతో నమ్మిస్తాడు. అతుకుల బోతుకుల దుస్తులతో ఓ పెంపుడు కుక్కను వెంటవేసుకొని రోడ్డుపై నిలబడతాడు. అంతే కాదు తనకు నిలువ నీడలేదని, ఆకలేస్తోందని, దీనంగా అర్దిస్తాడు. దీనితో జనం జాలిపడి అతడికి ఎంతో కొంత ఇచ్చి వెళ్లిపోతూ ఉంటారు. ఇలా రోజుకు 15 వేల దాకా చిల్లర రూపంలో అతనికి వస్తోంది. ఇక్కడే సైమన్ కు సమస్య వచ్చింది. ఈ చిల్లరను పౌండ్ల రూపంలో మార్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. బుక్ షాప్స్, బేకరీలు, ఇతర దుకాణాలకు తరచూ వెళ్ళి సంచుల కొద్ది నాణాలను పౌండ్స్ గా మార్చుకోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీస్ లకు సమాచారం ఇచ్చారట. దానితో పోలీస్ లు రంగప్రవేశం చేసి విచారిస్తే సైమన్, తను చేస్తున్న ఘనకార్యం వివరించాడు.

దీనితో పోలీస్ లు ఇతడిని కోర్ట్ కు హాజరు పరిస్తే, కోర్ట్ ఇతడిని లండన్ పరిసరాలలో రెండు ఏళ్ళు అడుక్కోవద్దని నిషేధించి, లండన్ నుంచి వెళ్ళిపోమని ఆదేశించింది. లండన్ కాకపోతే మరో మహానగరం. మరి ఏదో ఒక నగరంలో ఈపాటికే సైమన్ తన దుకాణాన్ని మళ్ళి తెరిచేసే ఉంటాడు. అడుక్కోవడంలో ఎలా కళాత్మకంగా మెప్పించాలో తెలిసిన సైమన్ రైట్ లాంటి మనుషులకు ఈ విశాలమైన ప్రపంచంలో బిచ్చమెత్తు కోవడానికి ఏదో ఒక చోటు దొరుకుతూనే ఉంటుంది. అందుకే తెలివి ఉండాలి కాని మార్గాలు అనేకం అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: