అల్లరి నరేష్ తో పాటు మరికొంత మంది హీరోలుగా అనిల్ సుంకర దర్శకత్వంలో 'యాక్షన్ 3డి' అనే మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఇటీవలే గుమ్మడికాయ ఫంక్షన్ అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా కాలం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ పూర్తి అయింది అని తెలుపడానికి, అలాగే ఈ మూవీ ఫై ఉన్న దిష్టి పోవడానికి ఈ ఫంక్షన్ జరిపినట్లుగా తెలుస్తుంది.

అయితే ఈ ఫంక్షన్ ని, ఈ ఫంక్షన్ లో చేసిన హడావుడిని చూసిన కొందరు అనిల్ సుంకర తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రానికి ఇంత హడావుడి అవసరమా అని అంటున్నారు. అల్లరి నరేష్ తప్ప ఈ సినిమాకి పెద్దగా చెప్పుకోవడానికి విశేషాలేమి లేవు. అలాగే తొలి 3డి ఇన్ తెలుగు అని చెబుతున్నారు. 3డిలు, 5డిలు తెలుగు ప్రేక్షకులకు కొత్తే. ఎంతవరుకు వాళ్ళు ఈ సినిమాని రీచ్ అవుతారని లేకుండా ఇలా గుమ్మడికాయ వగైరా ఫంక్షన్లు చేస్తున్నారు. సినిమా విడుదల అయిన తరువాత ఒకవేళ టాక్ తేడాగా ఉంటే అప్పుడు అందరూ 'ఈ పాటి సినిమాకి మళ్ళీ దిష్టి కూడానా!' అనేగా అంటారు?

మరింత సమాచారం తెలుసుకోండి: