మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాఫ్టువేర్ ఇంజనీర్స్ తో గొడవ పడటం, ఆ తరువాత మెగా ఫ్యామిలీ ఆ గొడవని నామ రూపాలు లేకుండా క్లోజ్ చేసి చరణ్ కి ఏం తెలియదు, తప్పంతా ఇంజనీర్సుదే అని మసి పూసే ప్రయత్నం చేశారు. ఫై గా వారి భవిష్యత్ పాడుకాకూదడనే వారిఫై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయంలో మెగా 'స్టార్' ఎలా పని చేసిందో అందరికి తెలిసిన విషయమే.

ఆ విషయం అలా ఉంచితే తాజా గా మరో మెగా హీరో అడ్డంగా బుక్కయ్యాదు. ఇటివలే 'గౌరవం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయాడు. ఫుల్ గా త్రాగిన మైకంలో ఉన్న అల్లు శిరీష్, ఢిల్లీ కి చెందిన ఓ యువతితో ప్రవర్తించిన తీరు సదరు యువతి వీడియోతో సహా పోలీసులకు ఇచ్చి అల్లు శిరీష్ ఫై కేసు పెట్టినట్లుగా తెలిసింది.

అయితే అల్లు శిరీష్ అడ్డంగా దొరికిపోయాడని అందరికి తెలిసినా, ఈ కేసు విషయంలో అతను ఎలా ఈజీగా బయటకి రాగలడో అందరికీ తెలిసిన అంశమే. కాకపోతే రామ్ చరణ్ విషయంలో మగవాళ్ళు అయివుండడం వల్ల మెగా ఫ్యామిలీ ఈజీగా కవర్ చేసేసింది కానీ, ఈ కేసులో లేడీ కావడం మెగా ఫ్యామిలీకి కొంచం రిస్క్ తో కూడుకున్న పనే అని అందరూ చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: