ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు మారుతి, తన పర్యవేక్షణ లో తన కెమెరామెన్ ప్రభాకర్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన చిత్రం 'ప్రేమకథా చిత్రమ్ '. ఈ మూవీ విడుదల అయిన ప్రతిచోటా మంచి టాక్ ని తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శింప బడుతుంది. ఈ మూవీ సక్సెస్ ని పురస్కరించుకుని హీరో సుదీర్ బాబు మామ అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఈ మూవీ టీం ని ప్రెస్ మీట్ పెట్టిమరీ అభినందించాడు.

అయితే ఈ అభినందనలో కూడా సూపర్ స్టార్ కృష్ణ తన కలెక్షన్ గోలని వదలలేదు. మహేష్ బాబు మూవీస్ సంబంధించి కృష్ణ ఆమధ్య ఏ విధంగా కలెక్షన్స్ చెప్పుకోచ్చాడో తెలిసిన విషయమే. మహేష్ మూవీస్ కలెక్షన్లకి డబ్బా కొట్టినట్లే సుధీర్ బాబు మూవీకి కూడా డబ్బా కొట్టడం మహేష్ ఫాన్స్ కి కొంచెం ఇబ్బంది కలిగించింది.

హిట్ సినిమా తీసిన టీంకి నా అభినందనలు అంటే సరిపోయేది. ఖర్చు పెట్టిన దానికంటే పదింతలు ఈ మూవీ సంపాదిస్తుంది అంటూ కృష్ణ చేసిన స్టేట్ మెంట్, ఘట్టామనేని ఫ్యాన్స్ కేమో గానీ, ఇతర హీరోల ఫ్యాన్స్ మాత్రం కృష్ణ ఇంక మారడురా బాబు అనుకుంటున్నారు. మరి ఇకనైనా కృష్ణలో మార్పు వస్తుందేమో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: