నందమూరి తారకరామారావునటవరసుడిగా 29ఏళ్ళ క్రితం పరిచయమైన నందమూరి యువ సింహం బాలకృష్ణ ఇప్పటి వారసత్వపు హీరోలులా కాకుండా తన తెరంగేట్రాన్ని చాలా సామాన్యంగా ఒక చిన్న సినిమాతో మొదలు పెట్టారు. నటుడుని  చూసుకుని పాత్రలను తీర్చి దిద్దుతూ ఉంటారు. కానీ బాలయ్య విషయంలో అటువంటి అవసరంలేదు. ఆయన ఈ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతారు. సాంఘీకం, జానపదం, చారిత్రాత్మకం ఇలా ఏసినిమాలలో అయినా ఎటువంటి పాత్రాలు చేయగల  నటుడు బాలయ్య.  

బాలయ్య కథానాయకునిగా విడుదలైన తొలి సినిమా ‘సాహసమే నా జీవితం’. కానీ తొలుత ప్రారంభమైన సినిమా మాత్రం ‘డిస్కోకింగ్’. ‘శ్రీవిష్ణు ఫిలింస్’ అనే ఓ చిన్న నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమాకు దర్శకుడైన తాతినేని ప్రసాద్ పెద్ద పేరొందిన దర్శకుడు కాదు. ‘డిస్కోకింగ్’ నిర్మాణంలో ఉండగానే ‘సాహసమే నా జీవితం’ మొదలై, నిర్మాణం పూర్తి చేసుకొని తొలి చిత్రంగా విడుదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, సూపర్‌స్టార్ ఎన్టీఆర్ కుమారుడు హీరోగా పరిచయమైన ఆ సినిమా ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై, ఘోర పరాజయం చవిచూసింది. పోనీ రెండో సినిమాగా విడుదలైన ‘డిస్కోకింగ్’ అయినా ఆడిందా అంటే... అదీ లేదు. ఆ సినిమా కూడా ఫ్లాప్. మూడో సినిమా ‘జననీ జన్మభూమి’ కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇలా తొలి మూడు ప్రయత్నాలూ బెడిసి కొడితే... ఏ హీరో భవితవ్యమైనా ప్రశ్నార్థకం అవుతుంది. కానీ బాలయ్య ఎన్టీఆర్ కుమారుడు మడమ తిప్పడం ఆయన రక్తంలోనే లేదు. అందుకే ధైర్యంగా నాలుగో అడుగు వేశారు. అదే ‘మంగమ్మగారి మనవడు’. ఆ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా  500 రోజులు ప్రదర్శితమై ఎన్టీఆర్ వారసుడి సత్తా ఏంటో తెలియజేసింది. అంటే బాలయ్య స్టార్ హీరోగా ఇండస్ట్రీకి రాలేదు. దక్షిణభారత చలనచిత్ర చరిత్రలో నటవారుసునిగా బాలయ్య రికార్డ్ ఎవరూ అధిగమించలేనిది.
బాలకృష్ణ నటునిగా మారి 39 ఏళ్లు కావొస్తోంది. ఇన్నేళ్లల్లో ఆయన సినిమాలు విడుదలవ్వని సంవత్సరాలు ఉన్నాయి కానీ, ఆయన నటించకుండా ఖాళీగా ఉన్న సంవత్సరం మాత్రం ఒక్కటి కూడా లేదు. దక్షిణాదిన ఏకధాటిగా 29 ఏళ్ల నుంచీ నటిస్తున్న ఏకైక నటవారసుడు బాలయ్యే.బాలకృష్ణ కథానాయకునిగా మారి 29 ఏళ్లు. సుదీర్ఘంగా ఇన్నేళ్లపాటు స్టార్ హోదా అనువిస్తున్న నటవారసుడు ఇండియాలోనే లేడంటే అతిశయోక్తి కాదు. మాస్‌లో అద్భుతమైన ఇమేజ్ బాలయ్య సొంతం. సరైన సక్సెస్ తగిలితే... పాత రికార్డులను ఇప్పటికీ బద్దలు చేయగల స్టామినా ఆయనది. త్వరలో బాలకృష్ణ వంద సినిమాలకు చేరువ కాబోతున్నారు. ‘సింహా’ లాంటి సంచలన విజయం తర్వాత మళ్లీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఆయన 97వ సినిమాగా ఆ సినిమా రాబోతోంది.  నటుడిగా  తన ప్రతిభను చాటుకున్న బాలయ్య 100వ సినిమాకు దర్శకుడిగా మారనున్నాడని  వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం తానే ఒక కధను తయారుచేసుకున్నట్లు సమాచారం. నందమూరి తారకరామారావు తరువాత తెలుగు చలన చిత్ర రంగంలో రాముడు, కృష్ణుడు ఇలా ఏపూరణ పాత్రలోనైన నటించి మెప్పించగల ఏకైక కధానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఈ రోజు కృష్ణా జిల్లాలో తన అమ్ముమ్మ గారి ఊరు లో తన అభిమానుల సమక్షములో అత్యంత ఘనంగా నేడు జరుపుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆయన సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ఆయన హాట్ టాపిక్. నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు....

మరింత సమాచారం తెలుసుకోండి: