మొన్న రామ్‌చ‌ర‌ణ్‌, ఈ రోజు... అల్లు శిరీష్‌. ఇద్ద‌రూ వివాదాల‌కెక్కారు. వాటిలో నిజం ఎంత‌?  ఎవ‌రి త‌ప్పు ఎంత‌?  అనే విష‌యాలు ప‌క్క‌న పెట్టండి. నిప్పు లేనిదే పొగ రాదు క‌దా..?  సీసీ కెమెరాల‌కు అడ్డంగా దొరికి కూడా.. బొంకిన ఘ‌న‌త చ‌ర‌ణ్‌ది. అమ్మాయి పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కినా - అయ్యో నాకేపాపం తెలీదు అంటూ నాట‌కాలు ఆడుతున్నాడు శిరీష్‌. నిజం నిల‌కడ మీద తెలియ‌డానికి ఇవి ఒక‌ప్ప‌టి రోజులు కావు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది. క‌నుసైగ చేస్తే ప‌న‌ల‌న్నీ చిటికెలో జ‌రిగిపోతాయి. ఎఫ్ ఐ ఆర్‌లు కూడా తారుమారు అవుతాయి. అంత స్టామినా - మెగా హీరోల‌కు ఉంది. దాన్ని అడ్డుపెట్టుకొని పూట‌కో ర‌కంగా రెచ్చిపోతున్నారు. ప‌వ‌న్ కూడా తక్కువ తిన‌లేదు. ఒకానొక సంద‌ర్భంలో ఓ పాత్రికేయునిపై దాడి చేసి త‌న జులూం చూపించిన వాడే.
చిరంజీవి వీళ్ల‌కంటే ఎక్కువ స్టార్ హోదాని అనుస‌రించిన‌వాడు. అదీ ద‌శాబ్దాల పాటు. అయితే ఎప్పుడూ ఇలాంటి వెర్రిమొర్రి చేష్ట‌ల‌కు దిగలేదు. మీడియా అంటే.. ఇప్ప‌టికీ అదే గౌర‌వం. త‌న‌ను నెత్తిమీద పెట్టుకొని ఇంత‌టి వాడిని చేసింది మీడియానే అని న‌మ్ముతారాయ‌న‌. సెట్లో, ఇంటా, బ‌య‌టా క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పిన దాఖ‌లాలు లేవు. మ‌రి వీళ్లెందుకు ఇలా త‌యార‌య్యారు. వెనుక చిరంజీవి అనే అధికారాన్ని చూసుకొనే క‌దా..? ఇలాంటి చేదు సంఘ‌ట‌న‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌రక్కుండా ఇంటిల్లిపాదినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్య‌త చిరుమీదే ఉంది. మెగా హీరోలంతా ఇంతేనా..? అని జ‌నాలు ఫీల‌య్యేలోగా చిరు.. అంద‌రినీ లైన్‌లో పెట్టాలి. ఒక్క‌సారి అలాంటి ముద్ర ప‌డిపోతే... ఏం చేసినా లాభం లేదు. బీ కేర్ ఫుల్ మెగా ఫ్యామిలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: