పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెయిన్ లో, ప్రిన్స్ మహేష్ లండన్ లో పరుగులు పెట్టిస్తున్నారు. టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి అతి చేరువలో ఉన్న హీరోలు ఎవరంటే ఎవరైనా సరే పవర్ స్టార్, ప్రిన్స్ పేర్లే చెపుతారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అగ్రపథాన దూసుకుపోతూ, యువ హీరోలను కూడా ప్రభావితం చేస్తున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వరుస హిట్స్ కొడుతూ, పలు బ్రాండ్ లకు ప్రచారకర్త గా బిజీ-బిజీ గా వున్న మరొక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. త్వరలో యూరప్ లో పవన్ కళ్యాణ్, లండన్ లో మహేష్ బాబు హంగామా చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అత్తారింటికి దారేది’(వర్కింగ్ టైటిల్) యూరప్ లో 20 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేసారు.

ఈ షెడ్యూల్ లో మొత్తం 3 పాటలు చిత్రీకరించనున్నారని సమాచారం.. స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా, ఇతర యూరోపియన్ కంట్రీలలో హీరోయిన్లు సమంత, ప్రణీతలతో కలిసి పవన్ డ్యూయెట్ సాంగ్స్ తో పాటు, పవన్ సోలో సాంగ్ కూడా చిత్రీకరించనున్నారు. అదే విధంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఇక్కడ షూట్ చేయనున్నారు. త్రివిక్రమ్ మరోసారి తన పంచ్ లైన్లతో ఈ ఫ్యామిలీ డ్రామాను అందించనున్నారు. మంచి అంచనాలు వున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరుగుతోందని సమాచారం.  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న‘1’ సినిమా షూటింగ్ ఈ నెల 18 నుంచి నార్తన్ ఐర్లాండ్(బెల్ ఫాస్ట్), లండన్, యుకెలో 60 రోజుల పాటు ఏకధాటిగా భారీ షెడ్యూల్ జరుగుతుంది అంటున్నారు.

 హీరోను విభిన్న తరహాలో చూపెట్టడం సుకుమార్ స్టైల్. అదే తరహాలో ఈ సినిమాలో కూడా మహేష్ బాబు ను కొత్తగా చూపించడానికి సుకుమార్ శ్రమిస్తున్నాడు. ఇప్పటికే ఇటీవల విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రావటంతో సినిమాపై భారీ అంచనాలు నమోదు అయ్యాయి. అలాగే ఈ సినిమా సాటి లైట్  రైట్స్ ను జెమినీ టీవీ 13 కోట్లు పెట్టి కొన్నాదని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా దసరా లోపు విడుదల సిద్దమవుతున్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మెగా హిట్ అవుతుంది అనే విషయం పట్టీ టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం నిర్ణయం అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం. మండే ఎండలు చల్లబదడంతో, చిరుజల్లుల చల్లదనంతో సేద తీరిన పవన్, మహేష్ లు తమ సినిమాలను త్వరగా పూర్తిచేయడానికి దర్శక నిర్మాతలను పరుగేత్తిస్తున్నారు.....

మరింత సమాచారం తెలుసుకోండి: