మ‌రో సౌంద‌ర్య‌.. అనే పేరు తెచ్చుకొంది నిత్య మీన‌న్‌. క‌థ‌ల విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించ‌డం, మంచి పాత్ర‌లే ఎంచుకోవ‌డంతో నిత్య‌పై అంద‌రికీ న‌మ్మ‌కాలు పెరిగాయి. అలా మొద‌లైంది, ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే లాంటి విజ‌యాలూ ఉన్నాయి. దాంతో నిత్య‌కు ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు. నిత్య ఎంత అడిగినా ఇవ్వ‌డానికి నిర్మాత‌లు సిద్ధంగా ఉన్నా - త‌ను మాత్రం ఇదివ‌ర‌క‌టిలా నిదాన‌మే ప్ర‌ధానం అనే పంథాలో సాగుతోంది. ప్ర‌స్తుతం నిత్య‌మీన‌న్ రేటు.. సినిమాకి అర‌కోటి. క‌థ బాగుండాలి, హీరో వ‌య‌సు.. మ‌రీ ఎక్కువ ఉండ‌కూడ‌దు, అనే ష‌ర‌తులు మాత్రం వ‌ర్తిస్తాయి. అర‌కోటి అన్నా భ‌య‌ప‌ప‌డం లేదు గానీ, నిత్య ష‌ర‌తుల‌కు మాత్రం నిర్మాత‌లు విస్తుపోతున్నారు. ఆ మాత్రం ఉండాల్లేండి. ఏ సినిమా ప‌డితే ఆ సినిమా చేసేస్తే.. నిత్య‌కు ఈ క్రేజ్ వ‌చ్చేదా?

మరింత సమాచారం తెలుసుకోండి: