మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న “ఎవడు” సినిమాపై మెగా అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బన్నీ కూడా ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ తో పాటు ఈ సినిమాలో చెర్రీ తో యామీ జాక్సన్ నటిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి అయిన యామీ ఈ సినిమాలో తన డేరింగ్ హాట్ లుక్స్ తో దుమ్మురెపబోతోంది అని టాక్.

 విదేశాలలో మోడలింగ్ రంగం నుండి వచ్చిన యామీ ని ఇప్పటివరకూ లంగావోని గెటప్ లో మాత్రమే దర్శకులు చూపించారు. ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న “ఐ” సినిమాలో కూడా ఈమెది పల్లెటూరు అమ్మాయి పాత్రే. కాని ఎవడు సినిమాలో మాత్రం ఆమె తన మోడలింగ్ విశ్వరూపాన్ని చుపెట్టడమే కాకుండా కుర్రకారును రెచ్చగొట్టే విధంగా తన చిట్టిపొట్టి దుస్తులతో రామ్ చరణ్ తో రొమాన్స్ చేస్తోందట. ఈ సినిమాకు యామీ డేరింగ్ హాట్ లుక్స్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తాయి అని దిల్ రాజు పూర్తి నమ్మకం మీద ఉన్నారట.

ఇప్పటికే ఈమె తన హాట్ లుక్స్ తో కెమేరాకు క్లిక్ మనిపించిన ఫోటోలు వెబ్ సైట్ లలో హడావుడి చేస్తున్నాయి. చెర్రీ యాక్షన్ సీన్స్ లకు యామీ అందాలు తోడవడంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని దర్శకుడు వంశీ పైడిపల్లి నమ్మకం మీద ఉన్నారని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: