ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సుప్రియ - అక్కడ అమ్మాయి, ఇక్క‌డ అబ్బాయితో తెర‌పైకి వ‌చ్చారీ జంట‌. ఒక‌రేమో కొణిదెల వారి అబ్బాయి, ఇంకొక‌రు అక్కినేని వారి అమ్మాయి. ఇప్పుడ‌ది రివ‌ర్స్ అయ్యంది. ఎలాగంటే.. నాగ‌బాబు కుమార్తె నిహారిక త్వ‌ర‌లోనే వెండి తెర‌పై ఎంట్రీ ఇవ్వ‌బోంది. హీరో ఎవ‌ర‌నుకొంటున్నారు. సిసింద్రీ అఖిల్‌. వీరిద్ద‌రూ క‌లిసి ఓ షార్ట్ ఫిల్మ్‌లో న‌టించారు. అందులో ఈ జోడీ అంద‌రికీ తెగ న‌చ్చేసింది. దాంతో అఖిల్ తొలి సినిమాలో హీరోయిన్ నిహారిక అయితేనే బాగుంటుంద‌ని... ఇరు కుటుంబాల వారూ ఫిక్స‌య్యార‌ట‌. మ‌రోవైపు నాగ‌బాబు కూడా త‌న వార‌సురాలిని వెండి తెర‌పై చూడాల‌నుకొంటున్నారు. ఆ త‌రుణం... ఇప్పుడొచ్చింది. అక్కినేని అబ్బాయి - కొణిదెల వారి అమ్మాయి.. ఈ కాంబినేష‌న్ అదుర్స్ క‌దూ. మ‌రి వీరిద్ద‌రినీ ఏ ద‌ర్శ‌కుడి చేతిలో పెడ‌తారో, ఆ శుభ త‌రుణం ఎప్పుడో...?

మరింత సమాచారం తెలుసుకోండి: