తెలుగు వారు గర్వింప తగ్గ మహానటుడు ఎస్వీ రంగారావు. హీరోగా ఆయన పాత్రలు ధరించకపోయినా, ఆనాటి మేటి హీరోలు ఏఎన్ఆర్, ఎన్టిఆర్ లకు ధీటుగా నిలబడ్డ విలక్షణ నటుడు ఎస్వీఅర్. సాంఘిక పాత్రలతో పాటు పురాణ పాత్రలు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎస్వీఅర్ డైలాగ్ మోడ్యులేషన్ ఇప్పటి తరం నటీనటులకు ఒక లైబ్రరీ లా ఉంటుంది. సంభాషణలలో స్పష్టత, హావభావాలు పలికించడంలో నైపుణ్యత ఆయన సొంతం. స్వతహాగా ఎస్వీఅర్ సాహితీ అభిమాని. షూటింగ్ విరామ సమయంలో ఆయన ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. ముఖ్యంగా ఆయనకు వివేకానందుడి గ్రంధాలు అంటే విపరీతమైన అభిమానం. ఆరోజులలో ముక్కామల, కొంగర జగ్గయ్య, జయలలిత, ఎస్వీ రంగారావు ఇళ్ళల్లో పెద్ద పెద్ద వ్యక్తిగత లైబ్రరీలు ఉండేవి. మార్కెట్ లోకి ఏదైనా మంచి పుస్తకం వస్తే వెంటనే ఆ పుస్తకాన్ని కొని రంగారావు తన లైబ్రరీ లో దాచుకొనే వారట.

సినిమాలలో రకరకాల పాత్రలను పోషించిన ఎస్వీఅర్ కు వివేకానందుడి జీవితాన్ని సినిమా గా తియ్యాలని కోరిక ఉండేదట. దీని గురించి ఒక ప్రముఖ రచయిత ల చేత స్క్రిప్ట్ కూడా తయారు చెయి౦చారట. కాని ఆ సినిమా నిర్మాణం ఆయన జీవిత కాలంలో జరగలేదు. ఈ సినిమా నిర్మాణం జరిగి ఉంటే ఎస్వీఅర్ జాతీయ స్థాయి నటుడు అయి ఉండేవారు. కాని అనివార్య కారణాలతో ఎస్వీఅర్ ఈ సినిమాను నిర్మించాకుండానే తన జీవితాన్ని చాలించారు.

ఆయన కల ఫలించకపోయినా వివేకానందుడు గెటప్ లో ఉన్న ఎస్వీఅర్ రంగారావు అపురూప ఛాయా గ్రహ చిత్రం మాత్రం ఇంకా మిగిలి ఉండడం మన తెలుగువారి అదృష్టం. అటువంటి మహోన్నత నటుడు తెలుగువాడిగా పుట్టడం మన అందరి అదృష్టం.  

మరింత సమాచారం తెలుసుకోండి: