ఆరేళ్లలో దాదాపు 15 సినిమాలు చేసి తెలుగు సినిమాను ఒక స్థాయి లో ఏలిన ఇలియానా, ఇక్కడి నుండి బాలీవుడ్ కి వెళ్ళి వరసగా సినిమాలు చేస్తోంది. ఇలియానా “భర్ఫీ” సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె అక్కడ నిలబడ గలుగుతుందా...? అనే సందేహాలు వచ్చాయి. కాని అందరి సందేహాలను మటుమాయం చేస్తూ ఈ ఇలి బేబీ అక్కడ కూడా బిజీ హీరోయిన్ గా మారిపొయింది.

 ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన ఒక సినిమాలో నటిస్తున్న ఈ గోవా సుందరి, ఈ సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలకు పచ్చ జెండా ఉపింది. ఒక సినిమాలో సైఫ్ ఆలీఖాన్ తో జోడిగా, మరో సినిమాలో వరుణ్ ధావన్ తో జోడిగా నటిస్తోంది ఇలియానా. ఈమధ్య మీడియాతో మాట్లాడిన ఇలి బేబీ “మీరు ఇక టాలీవుడ్ కు దూరం అయిపోయినట్లేనా..? అన్న ప్రశ్న కు సమాధానం ఇస్తూ, తాను జీవితంలో ఏది ప్లాన్ చేసుకోనని, ప్లాన్ చేసుకొనే విషయాలు ఏది జరగవని చెపుతూ తాను చిన్నప్పుడు సింగర్ ను కావాలి అని అనుకుంటే హీరోయిన్ గా సెటిల్ అయ్యానని, ఏది మన చేతిలో ఉండదు అంటూ వేదాంతం చెప్పింది.

అంతేకాదు దేవుడు ఏది ప్రసాదిస్తే, దానితో తృప్తి పడాలి అని భగవద్గీత సారాంశం కూడా చెప్పింది. ఇలియానా కు పాటలపై అభిరుచి ఉంది కాబట్టి మరి ఆ అభిరుచి ని కనిపెట్టి ఏ దర్శకుడు అయినా ఆమె చేత బాలీవుడ్ లోనో, టాలీవుడ్ లోనో పాటలు పాడిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: