ఇక్కడ ప్రస్తావన బాలీవుడ్ హిట్ సినిమా ‘దోస్తానా’ తెలుగు రీమేక్ కాదు గానీ రవితేజ, కళ్యాణ్ రామ్; వీరిద్దరి సినిమాలు రిలీజు కోసం ఎంతలా కష్టపడుతున్నాయో అన్నది సబ్జెక్టు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండు ప్రకారం అసలు రవితేజకు ఓపెనింగ్స్ రావడమే గగనం. కానీ ప్రసాద్ వర పొట్లూరి నిర్మాతగా రూపొందిన ‘బలుపు’ చిత్రం ఏకంగా ఇరవై కోట్ల పై చీలుకు బడ్జెట్ తో రూపొందబడింది. ఏ కోశాన చూసినా సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప ‘బలుపు’లో ముప్పావు రికవరీ కూడా సాధ్యం కాదు. అయినా శృతి హాసన్ అందలాను నమ్ముకొని సినిమాను ఎలాగోలా అమ్ముకొని ఈ నెల 28న విడుదలకు సిధ్ధం చేస్తున్నారు.

   రవితేజ, ప్రసాద్ వర పొట్లూరి దారిలోనే ఉన్నాడు నటుడు, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. ఈయనగారికి హీరోగా ఒకే ఒక్క ‘అతనొక్కడే’ తప్ప మరో హిట్ లేదు. అయినా క్వాలిటీ కోసం పాకులాడి ‘ఓం 3డి’ ప్రాజెక్టు కోసం సుమారుగా యాభై కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అసలీయన ధైర్యం ఏంటో అని అందరూ విస్తుపోయి చూస్తుంటే జులైలో రిలీజ్ అంటూ అనౌన్స్ చేసిపారేశాడు. బిజినెస్ సంగతో దేవుడెరుగు, కళ్యాణ్ రామ్ ‘ఓం’తరవాత ఇంకో సినిమా చేయాలంటే పరిస్థితి ఏంటి? అందుకే రవితేజ, కళ్యాణ్ రామ్ దోస్తులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: