ఇప్పుడు కృష్ణ‌వంశీకి వెంట‌నే ఓ అగ్ర‌హీరో అండ కావాలి. స్టార్ హీరోతో సినిమా చేయాల‌ని ఆయ‌న త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఎన్ని చిన్న సినిమాలు చేసినా, స్టార్ హీరోతో సినిమా చేసి... హిట్టు కొడితే - అందులోని మ‌జా వేరు. అందుకే ఆయ‌న దృష్టి పెద్ద హీరోల‌పై ప‌డింది. ఎన్టీఆర్‌,

మ‌హేష్‌, ప్ర‌భాస్‌.. వీళ్ల‌తో ఆయ‌న సినిమాలు చేసేశారు. మెగా ఫ్యామిలినీ మాత్రం ట‌చ్ చేయ‌లేదు. చిరుతో జ‌త క‌ట్టాల‌ని ఎన్ని విధాల ప్ర‌య‌త్నించినా అది స‌క్సెస్ కాలేదు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ నామ జ‌పం చేశారు. ఇప్పుడు ఎలాగైనా చ‌ర‌ణ్‌తో సినిమా చేయాల‌ని.. గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

చ‌ర‌ణ్‌కి ఇదివ‌ర‌కే కృష్ణ‌వంశీ ఓ క‌థ వినిపించారు. దానికి చ‌ర్రీ కూడా సై అన్నాడు. కాక‌పోతే.. చేతిలో మూడు సినిమాలుండడం వ‌ల్ల వీలు కాలేదు. అవ‌న్నీ ఒకొక్క‌టీ కొలిక్కి వ‌స్తున్నాయి. అందుకే ఇప్పుడు కృష్ణ‌వంశీ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశాలున్నాయి. త్వ‌ర‌లోనే ఆ కాంబినేష‌న్ సెట్ట‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: