బాలీవుడ్‌లో ఇలియానా పంట పండుతోంది. బ‌ర్ఫీ త‌ర‌వాత ఆమె ప్ర‌యాణం... ఆక్క‌డ జోరుగానే సాగుతోంది. యూత్ స్టార్స్ ఆమెతో జ‌త క‌ట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలియానా కూడా రేటు, రిబేటు అనే ప‌ద్ధ‌తి మీద డిస్కౌంట్లు ఇస్తోంది. ఇక్క‌డ‌లా కోటి.. అంటూ భ‌య‌పెట్ట‌డం లేదు. అంద‌రికీ అందుబాటు ధ‌ర‌ల్లో ఉండడంతో ఇలియానా కోసం నిర్మాత‌లు..

క్యూ క‌డుతున్నారు. ``వీలైనంత సంపాదించేయాల‌న్న కోరిక నాకెప్పుడూ లేదు. భారీ పారితోషికం అందుకోవాల‌న్న ఆశ‌ లేదు. మ‌న విజ‌యాల‌ను బ‌ట్టే క్రేజ్‌. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ న‌న్ను నమ్ముతోంది. ద‌క్షిణాదిలో ఎలాంటి పేరు తెచ్చుకొన్నానో, ఇక్క‌డా.. అలాంటి పేరే తెచ్చుకోవాల‌నేది మాత్ర‌మే నా ప్ర‌య‌త్నం. నిర్మాత‌లంద‌రికీ అంద‌రికీ అందుబాటులో ఉంటా`` అని చెప్పుకొచ్చిందీ గోవా భామ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: