ర‌జ‌నీకాంత్ అల్లుడు అనే బ్రాండ్ కంటే కొల‌వెరీ డీతో ఇంకా పాపుల‌ర్ అయిన హీరో ధనుష్. ఆ సాంగ్ తో వాల్డ్ వైడ్ పాప‌లారిటీ సంపాదించిన ధ‌నుష్ ఆ త‌రువాత న‌టిస్తున్న ప్రతి సినిమాపై చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఆ కేర్ సంగ‌తి పెడితే...త‌ను న‌టించే ప్రతి సినిమాతో మ్యాగ్జిమ్ ఎఫైర్ కోసం ట్రై చేస్తున్నాడ‌నే వార్త బిటౌన్ టు కోలీవుడ్ హల్ చ‌ల్ చేస్తోంది.

ఆ మ‌ద్య ధ‌నుష్, శృతిహాస‌న్ మ‌ద్య స‌మ్ ధింగ్ స‌మ్ ధింగ్ అంటూ ప్రచారం జ‌రిగితే ఇపుడు సోన‌మ్ క‌పూర్ తో కుచ్ కుచ్ న‌డుస్తోంది అంటోంది కోలీవుడ్ మీడియా. ధ‌నుష్ బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మవుతున్న రాంజ‌నా సినిమాలో సోనమే కధానాయిక‌. ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో ధ‌నుష్ సోన‌మ్ కి చాలా ద‌గ్గర‌య్యాడ‌ట‌. ధ‌నుష్ కి హిందీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వుండ‌టంతో సోనమ్ చాలా హెల్ప్ చేసింద‌ట‌. ఆ హెల్ప్ స‌మ్ ధింగ్ స‌మ్ ధింగ్ దాకా వెళ్లంద‌ని కొందరు అంటున్నారు. అదే విష‌యం ధ‌నుష్ ని అడిగితే ...అవును సోనమ్ కి ద‌గ్గర‌య్యాను బ‌ట్ అది బెస్ట్ ప్రెండ్ గానే సుమీ అంటూ ముసిముసిగా న‌వ్వుతున్నాడు. మ‌రి ఆ ముసిముసి న‌వ్వులకు అర్దం ఏంటో వేరే చెప్పాలా....?

మరింత సమాచారం తెలుసుకోండి: