ప‌విత్ర సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌ను మ‌ళ్లీ ఏలేద్దాం... అనుకొంది శ్రియ‌. ఈ సినిమాతో అటు అవ‌కాశాలు, ఇటు అవార్డులూ అంటూ బోలెడ‌న్ని లెక్క‌లు వేసుకొంది. అయితే అవ‌న్నీ గ‌ల్లంత‌య్యాయి. ప‌విత్ర సినిమా పాప‌ర్‌... అవ్వ‌డంతో శ్రియ క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌ల‌య్యాయి. అయినా... ఒవ‌ర్ కాన్ఫిడెన్స్ మాత్రం చూపిస్తోంది.అన్ని సినిమాలూ ఆడాల‌ని రూలేముంది? అయినా న‌టిగా నేను చేయాల్సింది చేశా.

ఫ‌లితంతో నాకు సంబంధం ఏమిటి?  అంటోంది. ఇంకా తాను ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోయినే అని చెబుతోంది. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు... వ‌రుస‌గా ప‌ది సినిమాలు చేతికొస్తాయి. ఇలాంటివి నా కెరీర్‌లో చాలాసార్లు జరిగింది. ఇదేమీ నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు. మొద‌టి ఇన్నింగ్స్ పూర్త‌యితే క‌దా.. మ‌రోటి మొద‌లు పెట్టేది.

నాకింకా అవ‌కాశాలు వ‌స్తాయి.. అంటోంది.శ్రియ ప్ర‌స్తుతం మ‌నం సినిమాలో న‌టిస్తోంది. నాగార్జున‌తో ఇది హ్యాట్రిక్ చిత్రం. ఇది వ‌ర‌కు రెండు సినిమాలూ శ్రియ‌కు మంచి పేరు తీసుకొచ్చిన‌వే. మ‌రి  ఈ సినిమా ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: