ద‌ర్శ‌కులుగా మారిన కొరియోగ్రాఫ‌ర్ల‌కు ముందు విజ‌యాలు బాగానే ప‌ల‌క‌రించాయి. ఆ త‌ర‌వాత... స‌రుకు అయిపోవ‌డం తో ఫ్లాప్‌లు ఎదుర‌య్యాయి. అమ్మ‌రాజ‌శేఖ‌ర్ ప‌రిస్థితీ అంతే. ర‌ణం సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు... ఈ డాన్స్ మాస్ట‌ర్. ఆ సినిమా హిట్ట‌వ్వ‌డంతో అమ్మ... రాజ‌శేఖ‌రూ అన్నారంతా. ఇక రెండో సినిమాకి అంచ‌నాలు పెరిగిపోయాయి. ఖ‌త‌ర్నాక్ సినిమా తీశాడు. అది చూసి జ‌నాలు బెంబేలెత్తిపోయారు.

అమ్మెయ్‌.. రాజ‌శేఖ‌ర్ అని ముక్త‌కంఠంతో అర‌చి గీ పెట్టారు. రాజ‌శేఖ‌ర్ సినిమాల్నీ... వ‌రుస‌గా బోల్తా కొడుతూనే ఉన్నాయి. దాంతో ఆయ‌న మెగాఫోన్ ప‌క్క‌న ప‌డేసి, నృత్య ద‌ర్శ‌కత్వంపైనే దృష్టి పెట్టాడు.అయినా అమ్మ రాజ‌శేఖ‌ర్ లో తాప‌త్రయం తీర‌లేదు. ఇప్పుడు మ‌రోసారి అమ్మ‌రాజ‌శేఖ‌ర్ మోగాఫోన్ ప‌ట్టుకొన్నారు. ఆయ‌న రూపొందించిన చిత్రం మ్యాంగో. పేరున్న హీరోల‌తో సినిమాలు తీసిన‌.. రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు కృష్ణుడు రేంజుకు ప‌డిపోయాడు.

హీరో చిన్న‌వాడైనా స‌రే - సినిమాని పెద్ద హిట్ చేయాల‌నే తాప‌త్ర‌యంతో క‌ష్ట‌ప‌డ్డాడ‌ట‌. ఈ సినిమాపైనే ఇత‌గాడి భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది.సినిమా పోతే.. ఇక ఆమ్మ రాజ‌శేఖ‌ర్ జీవితంలో మ‌రోసారి మోగాఫోన్ ప‌ట్టుకొనే ధైర్యం చేయ‌డేమో..?  మ‌రో హీరో అవ‌కాశం ఇవ్వాలంటే మాత్రం ఈ సినిమాని హిట్ చేయాల్సిందే. అందుకే మ‌నంద‌రికీ ఇది చిన్న సినిమానే అయినా... ఈ ద‌ర్శ‌కుడికి మాత్రం చాలా పెద్ద సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: