అల్ల‌రి న‌రేష్ సినిమా అంటేనే మినిమ‌మ్ గ్యారెంటీ. అటు సినిమా చూసినొళ్ల టికెట్ రేటు గిట్టుబాటు అవుతుంది. ఇటు సినిమా కొనే బ‌య్య‌ర్లు కూడా హ్యాపీనే. అందుకే న‌రేష్ సినిమా హాట్ కేట్‌లా అమ్ముడుపోతుంది. కానీ.. యాక్ష‌న్ త్రీడీ సినిమా ప‌రిస్థితి మాత్రం వేరేలా ఉంది. కార‌ణం.. ఈ సినిమా రేట్లు భారీ ఎత్తున చెబుతున్నార‌ట‌. అనిల్ సుంక‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త్రీడీ చిత్రం యాక్ష‌న్‌. ఈ సినిమా పూర్త‌యింది. అయితే విడుద‌ల తేదీ విష‌యంలో మాత్రం జాప్యం జ‌రుగుతోంది.

తొలుత ఈనెల 14న ఈ సినిమాని తీసుకొద్దాం అనుకొన్నారు. అయితే ఇప్పుడు 21కి వాయిదా ప‌డింది. దానికి కార‌ణం ఈ సినిమా ఇంకా అమ్ముడుపోలేదు.స‌పోజ్ న‌రేష్ సినిమాని ఓ ఏరియాకి పావ‌లాకి కొంటార‌నుకొందాం. ఇప్పుడు దాని విలువ రూపాయి చెబుతున్నారు నిర్మాత‌లు. కార‌ణం ఈ సినిమాకి భారీ ఎత్తున ఖ‌ర్చుపెట్ట‌డ‌మే. దాదాపు 25 కోట్లు ఈ సినిమాకి ఖ‌ర్చ‌య్యాయ‌ట‌. అంతా.. బ‌య్యర్ల ద‌గ్గ‌ర లాగేద్దాం అని చూస్తున్నారు నిర్మాత‌లు.

అయితే న‌రేష్ సినిమాని ఆ రేటు పెట్టి కొన‌డానికి ఎవ‌రూ ధైర్యం చేయ‌డం లేదు.న‌రేష్ సినిమాల్లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రం సుడిగాడు. అదే... రూ. 14 కోట్లు వ‌సూలు చేసింది. యాక్ష‌న్ సినిమాకి పెట్ట‌బ‌డి తిరిగి రావాలంటే సుడిగాడు కంటే సూప‌ర్‌గా ఉండాలి. మ‌రి అది సాధ్య‌మేనా?  అనేది బ‌య్య‌ర్ల అనుమానం. దాంతో వాళ్లంతా ఈ సినిమాకి దూరంగా ఉన్నారు. అందుకే నరేష్ సినిమా ఇలా వాయిదాలు ప‌డుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: