అసిన్ మంచి క‌థానాయిక మాత్ర‌మే కాదు.  భాషా ప్ర‌వీణురాలు కూడా. ఏ భాష అయినా ఇట్టే నేర్చుకొంటుంద‌ట‌. అమ్మానాన్న త‌మిళ అమ్మాయి అసిన్‌కు తొలి తెలుగు సినిమా. ఈసినిమాలో న‌టిస్తున్న‌ప్పుడు ఆమెకు తెలుగు రాదు. కానీ... సినిమా పూర్త‌య్యే సరికి తెలుగు నేర్చుకొంది. ధారాళంగా మాట్లాడ‌దు గానీ, అర్థం చేసుకొంటుంది. మిగ‌తా భాష‌లూ అంతే. గ్రంధాలు రాసేంత ప‌రిజ్ఞానం లేకపోయినా, అర్థం చేసుకొనేంత వ‌స్తే చాలు అనుకొంటుంది.

అందుకే ఎక్క‌డికెళ్లినా అక్క‌డి భాష గురించి క్షుణ్ణంగా తెలుసుకొంటుంద‌ట‌.ఇప్పుడు చైనీస్ నేర్చుకొంటోంది. ఆ భాష‌లోని మాధుర్యం అసిన్‌కి బాగా న‌చ్చింద‌ట‌. తాను నేర్చుకోవ‌డ‌మే కాదు, త‌న స్నేహితుల‌కూ నేర్పిస్తా అంటోంది. ``ప్ర‌తి భాష‌లోనూ ఓ మాధుర్యం ఉంటుంది.

భాష తెలుసుకొంటే అక్క‌డి సంస్ర్కృతిని సంప్ర‌దాయాన్నీ తెలుసుకొన్న‌ట్టే. అందుకే నేను కొత్త భాష‌ల‌పై దృష్టిపెడుతున్నా..`` అంటోంది.ద‌క్షిణాదిన అసిన్‌కు సినిమాల్లేక‌పోయినా, బాలీవుడ్‌లో మాత్రం వంద కోట్ల క‌థానాయిక‌గా గుర్తింపు పొందింది. త్వ‌ర‌లోనే ద‌క్షిణాదిన మ‌ళ్లీ త‌న ప్ర‌తాపం చూపించాల‌నుకొంటోంది. మ‌రి అసిన్ ఆశ నెర‌వేరుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: