cవ‌రుస ఫ్లాప్‌ల‌తో నానాటికీ దిజ‌గారిపోతోంది మెహ‌ర్ ర‌మేష్ కెరీర్‌. సినిమా చేస్తా.. అని మాటిచ్చిన ర‌వితేజ షాడో రిజ‌ల్ట్ చూసి హ్యాండిచ్చాడు. షాడో త‌ర‌వాత మెహ‌ర్ ర‌మేష్ కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇలాంటి ప‌రిస్థితిలో మెహ‌ర్‌కి ప‌వ‌న్ ఛాన్సివ్వ‌డం నిజ్జంగా హాట్ టాపిక్కే.అయితే ఇదంతా ఒట్టిదే అని ప‌వ‌న్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు.

ప‌వ‌న్‌ మెహ‌ర్‌కి ఛాన్సిచ్చే మూర్ఘుడు కాద‌ని వారి న‌మ్మ‌కం. ఆ మాట‌కొస్తే ఈ పరిశ్ర‌మ‌లో ఎద‌గాలి అనే ఏ హీరో కూడా మెహ‌ర్‌కి ఛాన్సివ్వ‌డట‌. అలాంటిది ప‌వ‌ర్‌స్టార్ అంత తేలిగ్గా లొంగ‌డ‌ని ఫ్యాన్స్ అంటున్నారు. ఒక వేళ నిజంగానే మెహ‌ర్ కి ప‌వ‌న్ ఒకే చెబితే అది మెహ‌ర్ గొప్ప‌దనం కాద‌ని,

కేవలం ప‌వ‌న్ మంచిత‌న‌మే అని అంటున్నారు.ఇప్పుడున్న పొషీష‌న్‌లో మెహర్‌తో జ‌త క‌ట్టే ఆలోచ‌న క‌నీసం క‌ల్లో కూడా రానివ్వ‌డు ప‌వ‌న్‌. గ‌బ్బ‌ర్ సింగ్‌తో మ‌ళ్లీ తన పూర్వ‌పు ఫామ్‌ని అందుకొన్నాడు ప‌వర్ స్టార్‌. దాన్ని నిల‌బెట్టుకోవాల‌ని అనునిత్యం క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇలాంట‌ప్పుడు రాంగ్ ట‌ర్న్ తీసుకోవ‌డం కెరీర్‌కే మాయ‌ని మ‌చ్చ అవుతుంది. అందుకే ప‌వ‌న్ త‌న జాగ్ర‌త్త‌ల్లో తాను ఉండ‌డం ఖాయం. సో ప‌వ‌న్ ఫ్యాన్స్... భ‌యాలు అవ‌స‌రం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: