క‌మ‌ల్ హాస‌న్‌లాంటి స్టార్ హీరో సినిమాలో ఆఫ‌ర్ అంటే ఎవ‌రైనా స‌రే, ఎగిరి గంతేస్తూ ఒప్పుకొంటారు. ఎందుకంటే క‌మ‌ల్ ఓ అసాధార‌ణ న‌టుడు. త‌న‌తో క‌లిసి న‌టిస్తే... న‌ట‌న‌లో మెళ‌కువ‌లైనా తెలుసుకోవ‌చ్చ‌ని. పైగా క‌మ‌ల్ సినిమా దేశ‌మంతా విడుద‌ల అవుతుంది. క‌మ‌ల్ పేరు చెప్పుకొని ఎంతో కొంత పాపులారిటీ తెచ్చుకోవ‌చ్చ‌ని. ఇలాంటి అవ‌కాశ‌మే కాజ‌ల్‌కి వ‌చ్చింది. లింగుస్వామి నిర్మాత‌గా... క‌మ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.

ఇందులో క‌థానాయిక‌గా కాజ‌ల్‌ని సంప్ర‌దించారు. అయితే కాజ‌ల్ ఈ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించింద‌ట‌.కాల్షీట్లు సర్దుబాటు చేయ‌లేకే ఈ సినిమా వ‌దులుకొన్నా అంటోంది.. కాజ‌ల్‌. ఈ విష‌య‌మై క‌మ‌ల్ హాస‌న్‌కు కాజ‌ల్ సారీ కూడా చెప్పింద‌ట‌. ఈ విష‌యాన్ని క‌మ‌ల్ కూడా లైట్‌గానే తీసుకొన్నాడు. వెంట‌నే మ‌రో క‌థానాయిక కోసం అన్వేష‌ణ మొద‌లుపెట్టేశాడు.అయితే కాజ‌ల్ ఈ ఆఫ‌ర్‌ని కాద‌న‌డానికి కార‌ణం కాల్సీట్ల స‌మ‌స్య కాద‌ట‌. త‌న కంటే వ‌య‌సులో

ముదిరిపోయిన క‌థానాయ‌కుడితో జ‌త క‌ట్ట‌డం కాజ‌ల్‌కి ఇష్టం లేద‌ట‌. అందుకే కాల్షీట్ల సాకుతో ఈ సినిమా వ‌దులుకొంద‌ని కోలీవుడ్ టాక్‌. ఇందులో కొంచెం నిజం కూడా ఉంది. ఎందుకంటే.. కాల్షీట్ల స‌మ‌స్య‌లో ఇరుక్కొనేంత బిజీగా కాజ‌ల్ లేదిప్పుడు. ఎందుకంటే ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అలాంట‌ప్పుడు కాల్షీట్ల స‌మ‌స్య ఎందుకు వ‌స్తుంది?

మరింత సమాచారం తెలుసుకోండి: