దేశ‌ముదురులో అల్లు అర్జున్ ఏ ముహూర్తంలో ష‌ర్టు విప్పి బాడీ చూపించాడో గానీ - అప్ప‌టి నుంచి తెలుగు హీరోలంతా బాడీ బిల్డ‌ర్లుగా మారిపోయారు. ఆఖ‌రికి నాగార్జున లాంటి సీనియ‌ర్ చేత కూడా ష‌ర్టు విప్పించారు. న‌వ్వుల సునీల్ కూడా కండ‌లు చూపించాడు. ఇప్పుడు మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్‌లు కూడా ఈ జాబితాలో దిగిపోయారు.

రామ‌య్యా వ‌స్తావ‌య్యా కోసం ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ బాడీలో క‌నిపించ‌బోతున్నాడు. 
ఇందు కోసం నాలుగు నెల‌లుగా ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుంటున్నాడు ఎన్టీఆర్‌. తార‌క్ బాడీ ఇప్పుడిప్పుడే సిక్స్‌ప్యాక్ రూపం సంత‌రించుకొంటోంది. అంత‌ర్జాతీయ ట్రైన‌ర్ జాన్ షూమెట్ ఆధ్వ‌ర్యంలో తార‌క్ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. అవి ఇప్పుడిప్పుడే ముగింపు ద‌శ‌కు చేరుకొంటున్నాయి. 

ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ కోసం చూపిస్తున్న తాప‌త్ర‌యం చూస్తుంటే ముచ్చ‌టేస్తోంది. అత‌ను ఏదైనా త్వ‌ర‌గా గ్ర‌హిస్తాడు. అందుకే...చాలా త‌క్కువ స‌మ‌యంలో పిక‌ప్ అయ్యాడు. ఎన్టీఆర్ ష‌ర్టువిప్పే ఘ‌డియ ఇంకెంతో దూరంలో లేదు..`` అని ఎన్టీఆర్ స‌న్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: