శేఖ‌ర్ క‌మ్ముల సినిమా గోదావ‌రితో వెలుగులోకి వ‌చ్చింది నీతూ చంద్ర‌. ఆ సినిమా నీతూ కెరీర్‌కి ఏ విధంగానూ ప్ల‌స్ కాలేక‌పోయింది. తెలుగులో ఆమె చేసిన సినిమాలు త‌క్కువే! ఇక్క‌డ అచ్చు రాలేద‌ని బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్క‌డా ఇదే సీను. ఫొటో షూట్‌లు చేసి, హాట్ హాట్‌గా త‌న‌ను ఆవిష్క‌రించుకొన్నా ప‌ట్టించుకొనే నాధుడే లేడు. ఇక నా ప‌ని అయిపోయింది అనుకొన్న త‌రుణంలో ఈ అమ్మ‌డికి హాలీవుడ్ ఆఫ‌ర్ వ‌చ్చింది.అదీ... జురాసిక్ పార్క్ ద‌ర్శ‌కుడి సినిమాలో.

జురాసిక్ పార్క్ 3 తీసిన జాన్‌స్ట‌న్ మ‌ళ్లీ ఓ అడ్వెంచ‌ర్ మూవీ తీస్తున్నాడు. అందులో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం నీతూని ఎంచుకొన్నారు. అయితే ఈ సినిమా కోసం నీతూ చాలానే క‌ష్ట‌ప‌డాలి. కొన్నాళ్ల పాటు.. సాహ‌స విద్య‌ల్లో శిక్ష‌ణ తీసుకోవాల‌ట‌. అంతేకాదు.. సినిమా షూటింగ్‌కి ముందే ట్రైల్ షూట్‌లో పాల్గొవాల‌ట‌. వీటిలో ఏమాత్రం సంతృప్తిక‌రంగా లేక‌పోయినా.. 

అస‌లు సినిమాలో నీతూ ఉండ‌దు. ఈ ష‌ర‌తుల‌ను కూడా నీతూ ఒప్పుకొంది. కొన్నాళ్ల పాటు అమెరికాలో శిక్ష‌ణ తీసుకోవ‌డానికి రెడీ అవుతోంది. మొత్త‌మ్మీద ఓ హాలీవుడ్ చిత్రం చేయ‌బోతోంది. ఇంట గెల‌వ‌కుండా రెచ్చ గెల‌వ‌డం అంటే ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి: