హీరో సిద్ధార్థ్ అండ్ సమంతా ప్రేమించుకుంటున్నారని, అతి త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే న్యూస్ ఈ మధ్య విపరీతంగా వస్తున్న విషయం తెలిసిందే. అందుకేనేమో సిద్ధార్థ్ , సమంతలు ఎక్కడ కనపడితే అక్కడ మీడియా ఈ విషయాన్ని హైలైట్ చేసేస్తోంది. 

 

తాజాగా తాను నటిస్తున్న 'సంథింగ్ సంథింగ్' సినిమాని ప్రోమోట్ చేయడానికి సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కూడా మీడియా సోదరులు సిద్ధార్థ్ ని, తన పెళ్లి గురించి  పదే పదే అడిగి ఇబ్బంది పెట్టారు. ఎంత గుచ్చి గుచ్చినా,సిద్ధార్థ్ మాత్రం తన పెళ్లి గురించి కాని, ప్రేమ గురించి కాని ఎటువంటి విషయం చెప్పలేదు. పైగా తన పెళ్లి మేటర్ పెద్దవాళ్ళకు వదిలేసానని, దయచేసి పర్సనల్ మేటర్స్ ఏమి అడగవద్దని చెప్పుకొచ్చాడు. 

 

అయినా ఏమైనా ఉంటే ఒక్కసారి చెబితే మళ్ళీ మళ్ళీ అడగరు కదా? ఇలా అస్తమానం ఏదో దాస్తున్నారు అని మీడియాకి అనుమానాలు తెప్పించే కంటే ఏదో ఒకటి చెప్పేస్తే పోలా? అసలీ నాన్చుడు ఎందుకు సిద్ధార్థ్??

మరింత సమాచారం తెలుసుకోండి: