బన్నీకి కేధరిన్ ఫై బాగా మనస్సు పడింది. ఇద్దరమ్మాయిలతో సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నాకలెక్షన్లు ఫరవాలేదు అనిపిచడం తో  అల్లు అర్జున్ హుషారుగా ఉన్నాడు. సాధారణంగా హీరోలకు చాలా సెక్సీగా కనిపిస్తూ తాము చెప్పినట్లు వినే భామలంటే చాలా ఇష్టం . అందుకే  ముంబై నుంచి కానీ, మరే దేశం నుంచి గానీ వచ్చిన హీరోయిన్స్ నే  వారు బుక్‌ చేసేస్తుంటారు. తాజాగా బన్నీకి ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించిన అమలాపాల్‌కన్నా, కేథరిన్‌ అంటే బాగా ఇష్టమట. నటనతోపాటు డాన్స్‌కూడా బాగా చేసిందనే కితాబిచ్చాడు.

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రంలో ఒక హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలని  అని ఆలోచనలు చేస్తున్నప్పుడు చేర్రీకి  బన్నీ ఓ సలహా ఇచ్చాడట. సమంత అయితే ఓకే,  అమలా పాల్ మాత్రం  వద్దు క్యాథరిన్‌ అయినా పర్వాలేదు. అంటూ చకచకా చెప్పేశాడట. దీంతో రామ్‌చరణ్‌ కూడా కేథరిన్‌పై మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది.  

అయితే మెయిన్‌ హీరోయిన్‌గాకాదు. సెకండ్‌ హీరోయిన్‌గా మరి మెయిన్‌ హీరోయిన్‌గా  చాలా మంది  పేరు పరిశీనలో ఉన్నాయి అంటున్నారు. ఇలా వరుస పెట్టి సెకండ్ హీరోయిన్స్ చాన్సులకు కేధరిన్ ఓకే అంటుందా అన్నదే ప్రశ్నార్ధకం ??

మరింత సమాచారం తెలుసుకోండి: