మెగా బ్రదర్ నాగబాబుకి  అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ కంటే ఫాలోయింగ్ ఎక్కువుగా పెరుగనుందా అనే డౌట్ ఈ మద్య నాగబాబు నడవడికను చూసిన ఎవరికైనా అనుమానం కలుగుతుంది. ఇప్పటికే ‘జబర్దస్త్’ టీవీ షో ద్వారా మంచి పాపులారిటిని సొంతం చేసుకున్న నాగబాబు మెగాభిమానులకు చాలా దగ్గరగా ఉండే ఒకే ఒక్క మనిషి. అందుకే మెగాభిమానులు చిరు, పవన్ ల తో పాటు నాగబాబు ని కూడా చాలా హై లెవెల్ లో ఎత్తేస్తుంటారు. 


చిరంజీవిలానే నాగబాబు కూడా తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తుండటం, ఈ మధ్య మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా వినకూడని వార్త వస్తే దానికి వెంటనే నాగబాబు స్పందించడం వంటి వాటితో పాటు, తన ఆహారపు అలవాట్లులో కూడా భారీ చేంజెస్ చేసుకోని సన్నబడటం వంటివన్ని నాగబాబుని ఈనాడు ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయి. 


ఇంకా నాగబాబు ఫాలోయింగ్ మీద డౌట్ ఉంటే రీసెంట్ గా జరిగిన 'అలియాస్ జానకి' ఆడియో రిలీజ్ కార్యక్రమంని తిలకేస్తే చాలు. డౌట్స్ అన్నీపటా పంచలవుతాయి.  ఒక్కసారి వరుణ్ తేజ తెర మీదకి వస్తే ఇక తండ్రీ కొడుకులను పట్టలేము ఏమో?

మరింత సమాచారం తెలుసుకోండి: