నిలబడిన మనిషిని సైతం తన సంగీతంతో ఊపేయగల టాలెంట్ దేవిశ్రీప్రసాద్ సొంతం. దేవిశ్రీ మ్యూజిక్ అంటే అందుకే అందరూ చెవులు కోసుకునేంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు సైతం ఈ మధ్య ఫామ్ కాపాడుకునేందుకు దేవిని ఫాలో అవడమో, కాపీ కొట్టడమో చేస్తున్నారంటే  అతను ఎంత ఫేమస్సో మనం అర్థం చేసుకోవచ్చు.  


ఇంతకీ ఏ విషయంలో ఇతర మ్యూజిక్ డైరెక్టరులు మనోడిని ఫాలో అవుతున్నారు? ఇంకే విషయం! తను మ్యూజిక్ కంపోజ్ చేసే ఏ మూవీ హీరోతోనైనా కనీసం ఓ బిట్ సాంగ్ అయినా పాడించడం దేవికి అలవాటు. అది జూనియర్ ఎన్టీయార్ కానీ, బన్నీ కానీ. ఈ ట్రెండు ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్న తమన్ కూడా ఇదే ఫార్ములా అనుసరిస్తున్నాడు. 
 

అసలు విషయంలోకి వస్తే, తాజాగా దేవిశ్రీ, నందమూరి నటసింహం బాలయ్య బాబుతో బోయపాటి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతే పాట పాడించిన దేవిశ్రీ, ఇప్పుడు బాలయ్య బాబుతో కూడా పాటపాడిస్తాడు అనే ఆలోచన అప్పుడే నందమూరి అభిమానుల్లో లేనిపోని ఆశలు చిగురింపచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: