మీలో  ఎవరైనా సినిమా తీసే ఉద్దేశంతో ఉన్నారా? మీ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అయితే బావుంటుందనుకుంటున్నారా? అయితే ఇది చదవండి, మీ సినిమాలో హీరోయిన్ గా నటించే నటికి కోటి రూపాయలు పారితోషికం ఇవ్వవలసిన పని లేదు  ఆమె కొత్త హీరోయిన్ కూడా కాదు పేరున్న కుటంబం నుంచి వచ్చిన తారా మణి.

 ఇక వివరాలలోకి వెళితే ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కూతురు సోనం కపూర్ కేవలం 11 రూపాయలు పారితోషికం తీసుకుంటూ ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ప్రముఖ క్రీడాకారుడు మిల్కా సింగ్ జీవితం ఆధారంగా ఓం ప్రకాష్ మెహ్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాలో తన పాత్ర నచ్చడంతో ఆ నిర్మాతలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో సోనమ్ ఇలా అతి తక్కువ పారితోషికానికి సినిమా చేస్తోంది.

 ఇది భారతీయ సినిమాకు సంబంధించి అధికారికంగా తీసుకుంటున్న అత్యల్ప పారితోషకం కావొచ్చు. ఈపాత్ర నచ్చడంతోటే తాను ఇంత తక్కువ పారితోషకానికి చేస్తున్నట్టుగా సోనమ్ ప్రకటించింది. మరి ఇలా ఆమెకు నచ్చే పాత్రతో తయారు చేసుకున్న కథతో వెళ్లే వారందరికి సోనమ్ ఇటువంటి ఆఫర్ ఇస్తుందేమో చూడాలి.....

మరింత సమాచారం తెలుసుకోండి: