రియల్ స్టార్ శ్రీహరి టాలీవుడ్ అగ్ర కుటుంబాల హీరోలను టార్గెట్ చేస్తున్నాడా? ఇప్పుడిదే ఆశక్తి కర చర్చ అన్ని చోట్లా వినపడుతోంది. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న నాగార్జున, బాలకృష్ణ వారికుటుంబ నేపధ్యం వలన టాప్ హీరోలుగా చలామణి అవుతున్నారన్న విషయం తెలిసిందే. వీరిద్దరి వెనక ఎంత కుటుంబ నేపధ్యం ఉన్నా వీరిలో ఉన్న టాలెంట్ వల్ల ఇంతకాలం నిలబడ గలిగారు అన్న విషయం ఎవరైనా ఒప్పుకోవలసిందే.

ఇటువంటి పరిస్థితులలో ఈ మధ్య పాలకొల్లులో జరిగిన ఒక కార్యక్రమంలో రియల్ స్టార్ శ్రీహరి కొన్ని వీరిద్దరి పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి మాట్లాడుతూ తాను ‘ఎన్టీర్ ఫ్యామిలీ నుంచి కానీ, ఎఎన్ఆర్ ఫ్యామిలీ నుంచి కానీ రాలేదనీ తాను ఈ రోజు ఈస్తాయి కి ఎదిగానంటే ప్రేక్షకుల సపోర్టే కారణం’ అన్న మాటలు ఆ సభకు విచ్చేసిన వారందరిని ఆశ్చర్యపరిచాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అనేక కుటుంబాలు తమ ఆది పత్యాన్ని చాటుకుంటు ఉంటే శ్రీహరి కేవలం ఈ రెండు కుటుంబాల పైనే ఫోకస్ ఎందుకు పెట్టారు అంటూ రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి .

మరొక విషయం ఏమిటంటే శ్రీహరికి ఇంత పేరు ప్రఖ్యాతలు రానప్పుడు తను చిన్నచిన్న పాత్రలతో ఎక్కువగా చేసింది బాలయ్యా, నాగ్ సినిమాలలోనే అని శ్రీహరి మరిచిపోయాడా అంటూ చాలామంది శ్రీహరి పై విమర్శలు చేస్తున్నారు. సామాన్యంగా వివాదాలకు దూరంగా ఉండే శ్రేహరి ఇలా మాటలు ఎందుకు వదిలారో ఆయనకే తెలియాలి సుమా....

 

మరింత సమాచారం తెలుసుకోండి: