టాలీవుడ్ లో యంగ్ హీరోల అదృష్ట దేవతగా నిత్యామీనన్ వెలుగొందుతోంది. పెద్ద హీరోల దృష్టి ఈమె పై పడకపోయినా చిన్న హీరోలతో నటిస్తూ ఆ హీరోలకు టాప్ హీరోల అదృష్టాన్ని కలగాచేస్తోంది ‘అలా మొదలైంది’ సినిమాలో నానీకి, ‘ఇష్క్’ సినిమాతో నితిన్ కూ చిన్న హీరోల స్థాయి నుండి పెద్ద హీరోల స్థాయి కి తీసుకు వెళ్ళింది ఈ అదృష్ట దేవత.

గత పది సంవత్సరాలుగా తెలుగు సినిమాలలో నటిస్తున్న అదృష్టం కలిసిరాక ఎటువంటి స్టార్ ఇమేజ్ పొందలేకపోతున్న హీరో శర్వానంద్. “ప్రస్థానం”, “గమ్యం” లాంటి సినిమాలలో నటించి, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నా, హీరోగా బ్రేక్ తెచ్చుకోలేకపోతున్నాడు శర్వానంద్. కనీసం నిర్మాతగానైనా రానిద్దామని “కో అంటే కోటి” సినిమాలో చేసిన ప్రయోగం కూడా విఫలం చెందడంతో, ప్రస్తుతం ఈ హీరో తన ఆశలు అన్నీ ఈ 5 అడుగుల భామ నిత్యా పై పెట్టుకున్నాడు. ప్రస్తుతం శర్వా నిత్యా మీనన్ తో “ఏమిటో ఈ మాయ” సినిమాలో నటిస్తున్నాడు. “ఆటోగ్రాఫ్” లాంటి మంచి సినిమాను తీసిన తమిళ దర్శకుడు చేరన్  ధర్శాకత్వ౦లో ఈ సినిమా త్వరలో రాబోతోంది.

తన తోటి యువహీరోలు నాని, నితిన్ లకు అందించిన అదృష్టమే తనకు నిత్యామీనన్ కలుగజెయ్యాలని గంపెడు ఆశలతో ఉన్నాడట ఈ యంగ్ హీరో శర్వానంద్. శర్వానంద్ పాలిట కూడా నిత్యా అదృష్ట దేవత గా మారుతుందో లేదో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈమెకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. అందుకే కాబోలు తన పారితోషికాన్ని కూడా ఒకే సారి 50 లక్షలకు పెంచేసింది. నిత్య గోల్డెన్ లెగ్ శర్వా కు అదృష్ట దేవతగా మారుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: